V6 News

ఇండియాలో పెరుగుతున్న కాలేయం వ్యాధులు..ప్రతి ఐదుగురిలో ఒకరికి సమస్య.. ఫ్యాటీలివర్ ఎందుకు వస్తుంది?

ఇండియాలో పెరుగుతున్న కాలేయం వ్యాధులు..ప్రతి ఐదుగురిలో ఒకరికి సమస్య.. ఫ్యాటీలివర్ ఎందుకు వస్తుంది?
  • భారత్ లో పెరుగుతున్న కాలేయం కొవ్వు సమస్యలు 
  • ప్రతి ఐదుగురిలో ఒకరికి ఫ్యాటీ లివర్ 
  • మారుతున్న జీవన శైలియే కారణమంటున్న డాక్టర్లు 
  • పద్దతి మార్చుకోకపోతే ముప్పు తప్పదంటు వార్నింగ్

భారత్ లో వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యల్లో ఫ్యాటీ లివర్ ఒకటి. ఇప్పుడు మన దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరిని ఫ్యాటీ లివర్ బాధిస్తోంది. ఇంతకుముందు కేవలం మందు తాగే వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య ఇప్పుడు అందరిలో విస్తరిస్తోంది.  ఇరవై ఏళ్లగా లివర్ సమస్యలపై ప్రత్యేక దృష్టితో వైద్యం చేస్తున్న డాక్లర్లు.. రోజురోజుకు పెరుగుతున్న ఫ్యాటి లివర్ సమస్యల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఫ్యాలీ లివర్ అంటే  ఏమిటీ..ఆల్క హాల్ తీసుకోకున్నా ఫ్యాటీ లివర్ సమస్యలు ఎందుకు వస్తున్నాయి. రోగ నిర్ధారణ ఎలా చేసుకోవాలి.. ఫ్యాటీ లివర్ సమస్య ముందుకు గుర్తించి బయటపడటం ఎలా..డాక్టర్లు ఏమంటున్నారో తెలుసుకుందాం.. 

మనదేశంలో ఫ్యాటీ లివర్ సమస్య.. మద్యం తాగేవారిలో కనిపించేది. ఇప్పుడు అసలు మద్యం సేవించని వారిలో కూడా ఫ్యాటి లివర్ ఉన్నట్లు  సాధారణ టెస్టులలో నిర్దారణ అవుతోంది. దీనికి ఎలాంటి లక్షణాలు గానీ, ముందస్తు హెచ్చరికలు గానీ లేవంటున్నారు డాక్టర్లు. ఇది ఆందోళన కలిగిస్తున్న విషయం. దాదాపు ప్రతి ఐదుగురు భారతీయులలో ఒకరు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. మారుతున్న జీవన శైలితో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం, జీవన శైలికి సంబంధించిన ఆరోగ్య సమస్యల్లో ఒకటిగా ఫ్యాటీ లివర్ మారిపోయిందని  పూణేలోని మణిపాల్ హాస్పిటల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం చీఫ్,కన్సల్టెంట్ డాక్టర్ ప్రసాద్ భాటే అంటున్నారు. 

ఫ్యాటీ లివర్ అంటే..

సాధారణంగా మద్యం తాగే వ్యక్తుల్లో కాలేయం కణాలలో అదనంగా కొవ్వు పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. దీనిని వైద్య పరిభాషలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్(NAFLD) అంటారు.చాలా సందర్భాలలో ఇది నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. ఈ వ్యాధి ప్రారంభంలో దీని లక్షణాలు ఏమీ కనిపించవంటున్నారు డాక్టర్లు. కొన్ని సార్లు అలసట, పొట్ట బరువుగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయంటున్నారు, వ్యాధి ముదిరిన తర్వాత లక్షణాలు గుర్తించబడతాయని చెబుతున్నారు. 

ఎందుకు ఫ్యాటీలివర్ పెరుగుతోంది.. 

ఎక్కువ సేపు కూర్చోవడం, తక్కువ శారీరక శ్రమ, కదలకపోవడం, కార్బోహైడ్రేట్లు తీసుకోవడం, స్వీట్స్, ప్రాసెస్ ఫుడ్ తీసుకోవడం వల్ల కొవ్వు పేరుకు పోతుందంటున్నారు డాక్టర్లు. షుగర్, ఓబెసిటీ, థైరాయిడ్ సమస్యలు  ఫ్యాటీ లివర్ కు దారి తీసే ఛాన్స్ ఉందంటున్నారు. 

రోగ నిర్ధారణ..

కాలేయంలో ఎంజైమ్ ల పరీక్షలు, అల్ట్రాసౌండ్ ఇమేజింగ్, కాలేయ బయాప్సీ ద్వారా లివర్ లోని హానికరమైన కొవ్వు  ఏ మోతాదులో ఉందో తెలుసుకోవచ్చంటున్నారు డాక్టర్లు.