సెలబ్రిటీలు, పవర్ ఫుల్ వ్యక్తులు నల్ల దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా..? బ్లాక్ డ్రెస్ వెనుక ఇంత సైకాలజీ దాగుందా..!

సెలబ్రిటీలు, పవర్ ఫుల్ వ్యక్తులు నల్ల దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా..? బ్లాక్ డ్రెస్ వెనుక ఇంత సైకాలజీ దాగుందా..!

నలుపు అంటే కొందరికి అపశకునం. ఏదైనా పండుగలు, వేడుకలు, కార్యక్రమాలకి ఎవరైనా బ్లాక్ డ్రెస్ తో వస్తే అయిపోయింది.. మొత్తం పాడు చేశారు అన్నట్లుగా చూసే వాళ్లు ఉంటారు. నల్ల బట్టలతో ఎవరైనా ఎదురు పడినా.. చిరాకు పడుతుంటారు. మంచి పనికి వెళ్తుంటే వీడు నల్ల బట్టలతో ఎదురొచ్చాడు అని తిట్టుకుంటారు. కొందరైతే ఆ కలర్ ను తమ లిస్టులో నుంచే తొలగిస్తుంటారు. కానీ సెలబ్రిటీలు, పవర్ ఫుల్ వ్యక్తులు ఎక్కువగా బ్లాక్ డ్రెస్ ని ఇష్టపడుతుంటారు. దీని వెనుక ఉన్న సైకాలజీ చూస్తే.. ఇన్నాళ్లు మిస్సయ్యామా అనుకోవాల్సిందే. 

కొందరు నలుపు రంగు దుస్తులకే ఎక్కువ ప్రధాన్యత ఇస్తుంటారు.  వారి వార్డ్‌రోబ్ తెరిస్తే, నల్లటి టీ-షర్టులు, నల్లటి షర్టులు, నల్లటి డ్రెస్సులు, నల్లటి ప్యాంట్లు ,నల్లటి జాకెట్లతో నిండి ఉంటుంది. మిగతా వారందరూ బ్రైట్ కలర్స్,  సీజనల్ ట్రెండ్‌లతో ప్రయోగాలు చేస్తుండగా, వారు మాత్రం ప్రతి ఉదయం మరో ఆలోచన లేకుండా అవే రంగులను ఎంచుకుంటారు. 

తొలిచూపులో, ఇది ఒక ఫ్యాషన్ సెలెక్షన్ అనిపించవచ్చు.  అయితే సైకాలజీ  ప్రకారం, హ్యూమన్ కల్చర్ లో నలుపు రంగుకు ఎప్పటి నుంచో ఒక ప్రత్యేక స్థానం ఉంది. బ్లాక్ హుందాతనానికి, అధికారానికి ప్రతీక అంటుంటారు. ఫ్యాషన్ వీక్‌లలో ఎక్కువగా బ్లాక్ ధరించడం చూస్తుంటాం. పెద్ద పెద్ద షోలలో జడ్జెస్ బ్లాక్ నే వేసుకుంటారు. లక్జరీ బ్రాండెడ్ కంపెనీలు వీటిని ఎక్కువగా తయారు చేస్తుంటాయి. 

రాక్ స్టార్లు, కళాకారులు, సీఈఓలు కూడా బ్లాక్ కే ప్రెఫరెన్స్ ఇస్తుంటారు. నలుపు రంగు ఇంత ప్రజాదరణ పొందడానికి కారణం ఏమిటంటే, అది ఒక క్లియర్ మెసేజ్ ఇస్తుందని చెప్తుంటారు. రంగులలో ఒక్కో రంగు ఒక్కో స్పెషల్. బ్రైట్ ఎల్లో రంగు దుస్తులు ఇన్ స్టంట్ ఉల్లాసాన్ని కలిగిస్తాయని అంటున్నారు. ఎరుపు రంగు శక్తిని లేదా ప్యాషన్ ను సూచిస్తుంది. గులాబీ రంగు సాఫ్ట్ నెస్ లేదా రొమాన్స్ తో ముడిపడి ఉంటుంది. వీటన్నింటికి భిన్నంగా నలుపు రంగు మరింత కాంప్లికేట్ కలర్ అంటుంటారు. అది శక్తివంతంగా కనిపించగలదు. అది సాఫిస్టికేటెడ్ గా కనిపించగలదు. అది మిస్టీరియస్ కనిపించగలదు. కొన్నిసార్లు ప్రొటెక్టివ్ గా కూడా అనిపిస్తుంది. లైఫ్ లో చాలామంది బ్లాక్ కలర్ ను చూజ్ చేసుకోవడం వెనుక ఉన్న ముఖ్యమైన కారణం..నల్లని దుస్తులు ఒక వ్యక్తి కాన్ఫిడెన్స్, కంఫర్ట్ ని ఇస్తాయని సైకాలజిస్ట్ లు అంటున్నారు. 

యూకేలోని ఫ్యాషన్ రిటైలర్ బై టీ-షర్ట్స్ ఆన్‌లైన్ నిర్వహించిన ఒక సర్వేలో, ఆత్మవిశ్వాసం (కాన్ఫిడెన్స్), తెలివితేటలు (ఇంటలిజెన్స్), ఆకర్షణతో (అట్రాక్షన్) మొదలైన అంశాలతో బ్లాక్ కలర్ ముడిపడి ఉన్నట్లు తేలింది. ప్రజలు తరచుగా నలుపు రంగును పవర్ ఫుల్ కరల్ గా భావిస్తారు. బ్లాక్  ధరించిన వ్యక్తి తన పనిని చాలా సీరియస్‌గా తీసుకున్నాడని నిశ్శబ్దంగా తెలియజేస్తుంది. ముఖ్యంగా తమ ఆత్మవిశ్వాసం, అధికారాన్ని చాటి చెప్పేందుకు సెలబ్రిటీలు, కంపెనీల సీఈఓలు, ఓనర్లు బ్లాక్ ధరిస్తారని సైకాలజిస్టులు చెబుతున్నారు. అందుకేనేమో.. స్టీవ్ జాబ్స్ వంటి వారు ప్రతిరోజూ బ్లాక్ డ్రెస్ ధరించి ప్రత్యేకతను చాటుకున్నారు.