V6 News

ఎండలో తిరిగి... ఇంటికొచ్చిన వెంటనే కూల్ వాటర్ తాగుతున్నారా...? మీరు రిస్క్ లో పడినట్లే...!

ఎండలో తిరిగి... ఇంటికొచ్చిన వెంటనే కూల్ వాటర్ తాగుతున్నారా...? మీరు రిస్క్ లో పడినట్లే...!

ఎండలు మండిపోతున్నాయి...వేడిగాలులు, తీవ్ర ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు జనం. అత్యవసరమైతే తప్ప పగటిపూట బయటికి వెళ్ళటం లేదు చాలామంది. ఇక తప్పక వెళ్లాల్సినవారు తగిన జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అలా ఎండలో తిరిగి ఇంటికి వచ్చినవారు అందరు మొదట చేసే పని... ఇంట్లోకి రాగానే ఫ్రిజ్ లో నుంచి చిల్డ్ వాటర్ బాటిల్ తీసుకొని కూల్ వాటర్ తాగడం. అలా తాగితే చల్లదనం మాట పక్కన పెడితే...మన ఆరోగ్యానికే ముప్పు అన్న సంగతి మీకు తెలుసా...? అవును ఎండలో తిరిగి ఇంటికి రాగానే చల్లటి నీళ్లు తాగడం మంచిది కాదంట... నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.

జీర్ణ వ్యవస్థపై ప్రభావం:

ఎండలో తిరిగి ఇంటికి రాగానే చల్లటి నీళ్లు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. వేడి వాతావరణం నుంచి చల్లటి వాతావరణంలోకి అడ్జస్ట్ అవ్వడానికి శరీరానికి కొంచెం టైం పడుతుందని చెబుతున్నారు.

గ్యాస్ట్రిక్ సమస్యలు:

ఎండలో తిరిగి ఇంటికి రాగానే చల్లటి నీరు తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. అంతే కాకుండా తలనొప్పి, గొంతు నొప్పి, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు.

బయటి నుంచి వచ్చిన వెంటనే కూల్ వాటర్ తాగకుండా 10 నుంచి 15 నిముషాలు ఆగిన తర్వాత తాగడం మంచిందని అంటున్నారు వైద్యులు. శరీర ఉష్ణోగ్రత మారడానికి కొంచెం సమయం పడుతుందని అంటున్నారు వైద్యులు.

బయటి నుంచి ఇంటికి రాగానే శరీరం చల్లబడటానికి కొంచెం సమయం ఇవ్వాలని... వెంటనే ఏసీ రూమ్ లోకి వెళ్లకుండా రూమ్ టెంపరేచర్ లో ఉండాలని అంటున్నారు. కూల్ వాటర్ తాగడం కంటే రూమ్ టెంపరేచర్ లో ఉండటం మంచిదని అంటున్నారు వైద్యులు.