TOXIC Trailer: ‘టాక్సిక్’ ఇంగ్లీష్ ట్రైలర్‌కు పిచ్చ క్రేజ్.. ఆడియన్స్ను కట్టిపడేస్తున్న మార్పులివే

TOXIC Trailer: ‘టాక్సిక్’ ఇంగ్లీష్ ట్రైలర్‌కు పిచ్చ క్రేజ్.. ఆడియన్స్ను కట్టిపడేస్తున్న మార్పులివే

KGF స్టార్ యష్ నుంచి వస్తున్న మూవీ ‘టాక్సిక్’ (TOXIC). వచ్చే బుధవారం (ఆగస్టు 26, 2026న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటివరకు వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన ఇంగ్లీష్ ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఇతర భాషల ట్రైలర్లతో పోలిస్తే ఇంగ్లీష్ వెర్షన్ మరింత స్టైలిష్‌గా, ఇంటర్నేషనల్ ఫీల్‌తో ఉందని అభిమానులు సోషల్ మీడియాలో ట్వీట్స్ పెడుతున్నారు.

ఆడియన్స్ను కట్టిపడేసిన కారణాలివే..

1. డబ్బింగ్ వెర్షన్ కాదు.. ఒరిజినల్ షూట్..

‘టాక్సిక్’ను కేవలం ఇతర భాషల్లో డబ్ చేయలేదు. కన్నడతో పాటు ఇంగ్లీష్ వెర్షన్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. దీంతో నటీనటుల లిప్-సింక్, హావభావాలు, డైలాగ్ డెలివరీ సహజంగా కనిపిస్తున్నాయి.

2. యష్ ఇంగ్లీష్ డైలాగ్ డెలివరీ

యష్ ఇంగ్లీష్ డైలాగ్స్‌ను చాలా నేచురల్‌గా డెలివర్ చేయడం ట్రైలర్‌కు మరింత బలాన్ని ఇచ్చింది. ఎక్కడా ఓవర్‌గా అనిపించకుండా, పాత్రకు తగ్గట్టుగా ఆయన చెప్పిన డైలాగ్స్ విజువల్స్‌తో బాగా సింక్ అయ్యాయని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

3. హాలీవుడ్ స్థాయి గ్లోబల్ ఫీల్..

ట్రైలర్‌లోని యాక్షన్, విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ అన్నీ కలిపి సినిమాకు హాలీవుడ్ తరహా టచ్‌ను తీసుకొచ్చాయి. ముఖ్యంగా ట్రైలర్ టోన్, స్క్రీన్ ప్రజెంటేషన్ గ్లోబల్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు కనిపిస్తోంది.

4. ట్రైలర్‌లో స్వల్ప మార్పులు

ఇతర భారతీయ భాషల వెర్షన్లతో పోలిస్తే ఇంగ్లీష్ ట్రైలర్ దాదాపు 11 సెకన్లు తక్కువగా ఉంది. కొన్ని సన్నివేశాల ఎడిటింగ్, షాట్‌ల క్రమంలో చేసిన స్వల్ప మార్పులు ట్రైలర్‌కు మరింత ఫాస్ట్-పేస్డ్ ఫీల్‌ను ఇచ్చాయి. యాక్షన్ కొరియోగ్రఫీకి హాలీవుడ్ యాక్షన్ సినిమాలతో అనుభవం ఉన్న J.J. పెర్రీ పనిచేశారు. ‘జాన్ విక్’, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ వంటి యాక్షన్ చిత్రాలతో సంబంధం ఉన్న ఆయన పర్యవేక్షణలో యాక్షన్ సీక్వెన్స్‌లు రూపొండం చాలా రిచ్ నెస్ తీసుకొచ్చింది.

మొత్తంగా చూస్తే, కన్నడతో పాటు ఇంగ్లీష్ ఆడియన్స్‌ను కూడా టార్గెట్ చేస్తూ ‘టాక్సిక్’ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే ఇంగ్లీష్ ట్రైలర్‌కు సోషల్ మీడియాలో స్పెషల్ క్రేజ్ కనిపిస్తోంది. థియేటర్లలో ఇంగ్లీష్ వెర్షన్‌ను చూసేందుకు యష్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.