బాలీవుడ్ హీరో ఇమ్రాన్ ఖాన్ దేశ బహిష్కరణ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సినీ, రాజకీయ, సోషల్ మీడియాలో ఈ అంశం ట్రెండింగ్ గా మారింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ అల్లుడు.. బాలీవుడ్ లో సినిమాలు తీస్తూ అందరికీ సుపరిచితమైన వ్యక్తిపై ఎందుకు దేశ బహిష్కరణ అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇమ్రాన్ ఖాన్ పై ఎందుకు దేశ బహిష్కరణ నడుస్తోంది..? ఆయన చేసిన తప్పేంటి..? ఈ కేసు వెనుక ఉన్ని అంశాలేంటో తెలుసుకుందాం.
ముంబై పోలీసుల నోటీసుల ప్రకారం.. ఇమ్రాన్ ఖాన్ 2026 అక్టోబర్ 28 లోపు దేశం విడిచి వెళ్లాలి. ఎందుకు పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారనేది ఇప్పుడు అందరి ప్రశ్న. దీనికి కారణం ఇమ్రాన్ ఇండియాలో సీజేపీ ప్రొటెస్టులో పాల్గొనటమే. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ జరిగిన ఆందోలనల్లో పాల్గొనటంతో ఆయనకు నోటీసులు పంపారు పోలీసులు.
ఇమ్రాన్ ఖాన్ నిరసనల్లో పాల్గొనకూడదా..?
నిరసనల్లో పాల్గొంటే దేశం విడిచి ఎందుకు వెళ్లాలి..? ఇండియాలో విద్యార్థులు, రాజకీయ ప్రముఖులు, సినీ తారలు ఎందరో ఆందోళనల్లో పాల్గొంటున్నారు. మరీ అందరికీ లేని నిబంధనలు ఇమ్రాన్ ఖాన్ కు ఎందుకు? దీనికి కారణం.. ఇమ్రాన్ ఖాన్ కు భారత పౌరసత్వం లేకపోవడమే. ఆయనకు పుట్టుక నుంచి అమెరికా పౌరసత్వం ఉంది. ఇండియాకు ప్రవాస భారతీయుడిగా విజిట్ చేసే విధంగా విసా పర్మిషన్ ఉంది.
చట్టం ప్రకారం భారత పౌరుడు కానటువంటి ఇమ్రాన్.. ఇండియాలో ఆందోళనల్లో పాల్గొనటానికి అవకాశం లేదని పోలీసులు చెబుతున్నారు. కేవలం ఇండియా వచ్చి వెళ్లవచ్చు. అంతేకాని నిరసనల్లో పాల్గొని.. ఇతరులను రెచ్చగొట్టేలా.. మోటివేట్ చేసేలా వ్యవహరించకూడదని పోలీసులు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిరసనల్లో పాల్గొన్న కారణంగా ఆయన వెంటనే ఇండియా వదిలి వెళ్లాల్సిందిగా నోటీసులు జారీ చేశారు పోలీసులు.
ఇమ్రాన్ ముంబైలోని క్రాంతి మైదానంలో జరిగిన నిరసనల్లో పాల్గొనటంతోనే అప్పట్లోనే అదుపులోకి కూడా తీసుకున్నారు. నిరసన ప్రదర్శనలు చేసినట్లు కూడా పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇమ్రాన్ ఇమిగ్రేషన్ వీసాలో ఉన్న ఇమ్రాన్.. నిరసనల్లో పాల్గొనటంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పోలీసులు .. అక్టోబర్ 28 లోపు దేశం విడిచి వెళ్లాలని నోటీసులు పంపించడం గమనార్హం.
