Viral Video: మాల్లో మరో మహిళతో భర్త ..చెంప చెల్లుమనిపించిన భార్య

Viral Video: మాల్లో మరో మహిళతో భర్త ..చెంప చెల్లుమనిపించిన భార్య

భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని..తనకు తెలియకుండా సినిమాలు, షికార్లు, షాపింగ్ లు చేయిస్తున్నాడని అతని భార్యకు అనుమానం వచ్చింది. ఎలాగైన రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలనుకుంది. షాపింగ్ మాల్లో భర్త, అతని ప్రియురాలిగా అనుకుంటున్న మహిళను చూసింది. కోపంతో ఊగిపోయింది. వారిద్దరిని చితక్కొట్టింది.భర్త వివాహేతర సంబంధం గురించి తెలుసుకొని షాపింగ్ మాల్ లో వీరిద్దరితో గొడవపడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంఘటన ఎక్కడ జరిగింది స్పష్టత లేదుగానీ.. ఓ పెద్ద షాపింగ్ మాల్ లో జరగగా చూసిన వారు వీడియో తీసి Xలో పోస్ట్  చేశారు. ఈ సంఘటన పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం.. 

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ వీడియోలో భర్తను , అతని ప్రియురాలిగా అనుమానిస్తున్న మరో మహిళను చెంప దెబ్బలతో దడదడలాడించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. మొదట భర్తను చెంప దెబ్బ కొట్టి పడిపోయిన బ్యాగ్ ను ఎత్తుకొని వెళ్తూ .. వెళ్తూ.. భర్త ప్రియురాలిగా అనుమానిస్తున్న మహిళను జుట్టు పట్టుకొని లాగి కింద పడేసి వెళ్లిపోయింది.. ఈ దృశ్యాలను అక్కడ ఉన్న కొంతమంది కస్టమర్లు షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు.    

ఇదే కాదు.. భర్తలపై భార్యల ఆగ్రహానికి సంబంధించిన ఘటనల ఇటీవల ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాలో జరిగింది. ఓ మహిళ తన భర్త తనకు మెమోలు తీసుకురావడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మెమో అంటే భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్నాక్స్. మల్పురాకు చెందిన ఫిర్యాదు చేసిన మహిళ ఎనిమిది నెలల క్రితం పినహట్ కు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. తనకు మెమోస్ తినడమంటే చాలా ఇష్టమని.. పెళ్లయిన తర్వాత భర్త రోజు తనకు మెమోలు తెస్తానని మాటిచ్చాడు. అయితే కొంత కాలంగా తర్వాత మెమోలు తీసుకురావడం మానేశాడు.. దీంతో భార్యభర్తల మధ్య తరుచుగా గొడవలు జరిగేవి. చివరికి భర్త కంప్రమయిజ్ చెంది .. రోజు తన భార్యకు మెమోస్ తెచ్చిపెడతానని పోలీసుల ముందు ఒప్పుకోవడంతో  వివాదం సద్దుమణిగిందట..