గత కొన్నాళ్లుగా యావత్ సినీ ప్రపంచం, కోట్లాది మంది అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆ మధుర ఘట్టం ఆవిష్కృతమైంది. టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు వివాహ బంధంతో ఒకటయ్యారు. ఈ రోజు ( ఫిబ్రవరి 26, గురువారం ) రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్ వేదికగా వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది.
రెండు సంప్రదాయాల్లో పెళ్లి
విజయ్, రష్మికల వివాహం అత్యంత వైభవంగా, రెండు వేర్వేరు సంప్రదాయాల ప్రకారం జరిగింది. ఉదయం 10:10 గంటలకు ఉదయ్‌పూర్‌లోని ప్రసిద్ధ ITC మెమెంటోస్ హోటల్‌లో వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఉదయం వేళ విజయ్ దేవరకొండ ఇంటి ఆచారం ప్రకారం తెలుగు సంప్రదాయ పద్ధతిలో వివాహం జరిగింది. సాయంత్రం రష్మిక పుట్టిన గడ్డ అయిన కూర్గ్ (కొడవ) సంప్రదాయం ప్రకారం మరో వివాహ వేడుకను నిర్వహించారు. తమ పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఈ జంట గతంలోనే ఒక భావోద్వేగపూరిత పోస్ట్‌ను షేర్ చేశారు. "మీరు మాకు ‘విరోష్’ (VIROSH) అని పేరు పెట్టారు. అందుకే మా కలయికకు గౌరవంగా ఈ వేడుకను ‘ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ అని పిలుచుకుంటున్నాం" అంటూ అభిమానులపై తమకున్న ప్రేమను చాటుకున్నారు.
వికీపీడియాలో అప్‌డేట్..
పెళ్లి ఫోటోలు ఇంకా సోషల్ మీడియాలోకి రాకముందే, వీరిద్దరి వికీపీడియా (Wikipedia) పేజీలు అప్‌డేట్ అవ్వడం విశేషం. విజయ్ దేవరకొండ భార్య కాలమ్‌లో రష్మిక పేరు, అలాగే రష్మిక పేజీలో విజయ్ పేరు చేరిపోయాయి. ప్రస్తుతం ఈ స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 36 ఏళ్ల విజయ్, 29 ఏళ్ల రష్మికల మధ్య ఏడేళ్ల వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ, వారిద్దరి మధ్య ఉన్న అవగాహన, కెమిస్ట్రీ చూసి అభిమానులు మురిసిపోతున్నారు.
సీక్రెట్ లవ్ నుంచి పెళ్లి పీటల వరకు..
'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో వెండితెరపై మాయ చేసిన ఈ జోడీ, నిజ జీవితంలో కూడా ప్రేమలో ఉన్నారని గత కొన్నేళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వారు ఎప్పుడూ తమ ప్రేమను బహిరంగంగా ఒప్పుకోలేదు. కానీ, ఒకే లొకేషన్ నుంచి విడివిడిగా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు హింట్స్ ఇస్తూనే ఉండేవారు. మాల్దీవుల వెకేషన్ నుండి దుబాయ్ ట్రిప్స్ వరకు వీరిద్దరూ కలిసే ఉన్నారనే విషయాన్ని ఫ్యాన్స్ ఎప్పుడో కనిపెట్టేశారు.
హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్!
ఉదయ్‌పూర్‌లో కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహం జరిగింది. మార్చి 4న హైదరాబాద్‌లో భారీ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. తమ అభిమాన జోడీ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడంతో సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. "హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వైరోష్" అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
Omgggggggg the South Indian aesthetics sooo beautiful decoration 😭💗✨#RashmikaMandanna #VijayDeverakonda #TheWeddingOfViRosh #ViRosh #ViRoshWedding pic.twitter.com/KSTIPn3lZf
— ʀᴀꜱʜᴍɪᴋᴀ ꜰᴀɴ ᴜᴍᴀɪᴅ💕 (@rashmikasreign) February 26, 2026
