వచ్చే పదేండ్లలో సీఎం అవుతా : సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి

వచ్చే పదేండ్లలో సీఎం అవుతా : సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సంగారెడ్డి, వెలుగు: వచ్చే పదేండ్లలో తెలంగాణ రాష్ట్రానికి సీఎం అవుతానని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం సాయంత్రం సంగారెడ్డిలో జరిగిన దసరా వేడుకల్లో ఆయన ఈ కామెంట్లు చేశారు. ‘‘దసరా పండుగ సందర్భంగా నా మనసులో మాట చెబుతున్నాను. కచ్చితంగా వచ్చే పదేండ్లలో నేను సీఎం అవుతాను. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున చాలా విషయాలు బయటకు చెప్పలేకపోతున్నాను.

ఈసారి నన్ను పోటీ చేయనీయకుండా చాలామంది చాలా ప్రయత్నించారు. సంగారెడ్డి అంటేనే జగ్గారెడ్డి.. ప్రజలకు, కార్యకర్తలకు ఏ కష్టమొచ్చిన అండగా ఉంటా. నా భార్య, అనుచరులు కూడా అందుబాటులో ఉంటారు. ఈ ఎన్నికల్లో కూడా నన్ను ఆశీర్వదించండి”అని జగ్గారెడ్డి ప్రజలను కోరారు.