MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులతో పాటు క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రశ్న మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఐపీఎల్ 2027 (IPL 2027)లో ఆడతారా లేదా అని?.. ఇప్పుడు ఈ విషయంపై సీఎస్కే లెజెండ్ ధోనీ స్పందిస్తూ, తన ఆటకు సంబంధించి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, డిసెంబర్ నాటికి వచ్చే మెడికల్ రిపోర్టులు, ఫిట్‌నెస్ ఆధారంగానే తుది నిర్ణయం తీసుకుంటానని తేల్చి చెప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్ స్క్వాడ్‌లో మహీ భాయ్ ఉన్నప్పటికీ, గాయం కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయారు.
ధోనీ మార్క్ మార్చే కామెంట్స్:
* బెంగళూరులో జరిగిన ఒక హెల్త్‌కేర్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎస్ ధోనీని ఐపీఎల్ 2027లో ఆడే ఆలోచన ఉందా అని ప్రశ్నించగా, ఆయన తనదైన శైలిలో నవ్వుతూ సమాధానమిచ్చారు. డాక్టర్.. ముందుగా నేను అన్ని హెల్త్ టెస్టులు చేయించుకోవాలి.. మీరు నాకు ఆ రిపోర్టు ఇవ్వాలి.. ఆ తర్వాత డిసెంబర్ కంటే ముందే నేను ఎంత ఫిట్‌గా ఉన్నానో చూసుకుని, మరో సీజన్ ఆడగలనో లేదో నిర్ణయించుకుంటానని పేర్కొన్నాడు.
CSK రీటెన్షన్స్, జహీర్ ఖాన్ కొత్త శకం:
ఐపీఎల్ 2027 రిటైన్ మార్గదర్శకాల గడువు దగ్గర పడుతుండటంతో, ఎంఎస్ ధోనీ ఇచ్చే క్లారిటీ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి అత్యంత కీలకం కానుంది. సుదీర్ఘకాలం హెడ్ కోచ్‌గా వ్యవహరించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ వైదొలగడంతో, భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్‌ను (Zaheer Khan) కొత్త హెడ్ కోచ్‌గా సీఎస్కే యాజమాన్యం నియమించింది. జట్టు పునర్నిర్మాణం (Overhaul) జరుగుతున్న వేళ, మహీ భాయ్ అందుబాటులో ఉంటే అది జట్టుకు, అభిమానులకు కొండంత అండగా నిలవనుంది.
VIDEO | Bengaluru: "RCB have been consistent against us, hope to stay injury-free and deliver close games," says Cricketer Mahendra Singh Dhoni. (Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) #MSD #CSK #RCB #Dhoni https://t.co/9Rs5p4oPVI
— Press Trust of India (@PTI_News) October 24, 2026
First ball: 6️⃣ Wait for the second ball! 👀 #WhistlePodu #Yellove https://t.co/KGI5msRcf5
— Chennai Super Kings (@ChennaiIPL) October 24, 2026
