ఈదురుగాలులకు నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు

ఈదురుగాలులకు నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు

నైరుతి రుతుపవనాల ప్రభావంతో జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని తాళ్లధర్మారంలో ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది.బలమైన ఈదురు గాలులకు గ్రామంలోని ప్రధాన రహదారిపై భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్​ స్తంభాలు విరిగిపోయాయి. దీంతో పవర్​ లేక ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. రోడ్డుకు అడ్డంగా వృక్షాలు పడిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటు అన్నదాతలు కూడా వర్షం భారీ నుంచి ధాన్యం తడిసిపోకుండా వాటిని కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. రాకాసి గాలులకు రేగుల షెడ్లపై ఉన్న రేగులు ఎగిరిపోయాయి.