సుమన్కు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు

సుమన్కు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు

హీరో సుమన్ సినీ ఇండస్ట్రీకి వచ్చి 45 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్బంగా పలువురు సుమన్ కు అభినందనలు తెలుపుతున్నారు.  ఈ సందర్భంగా  మెగాస్టార్ చిరంజీవి సుమన్ కు విషెస్ చెబుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ‘ మైడియర్ బ్రదర్ సుమన్ ఫిలీం ఇండస్ట్రీలో 45 ళ్లు కంప్లీట్ చేసుకోవడం ఆనందంగా ఉంది.  మనస్ఫూర్తిగా  శుభాకాంక్షలు తెలియజేస్తున్న. దాదాపు  10 బాషల్లో 700లకి పైగా చిత్రాల్లో నటించడం గొప్ప విషయం. నీ కమిట్ మెంటో ఏంటో నీ సినిమాలే చెబుతాయి. ఇంకా మర్ని సంవత్సరాలు అభిమానులను అలరించాలని కోరుకుంటున్నా.  ఈ నెల 16న మంగళూరులో మీ 45 ఏళ్ల కెరీర్  పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించే  ఈవెంట్  విజయవంతం కావాలని కోరుకుంటున్నా’ అని చిరంజీవి తెలిపారు. 

హీరో సుమన్ నీచల్ కులమ్ అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. 1990 నుంచి 1998 మధ్య స్టార్ హీరోగా పేరుగాంచారు. ముఖ్యంగా అన్నమయ్య,శ్రీరామదాసు లాంటి భక్తి సినిమాల్లో నటించి మెప్పించారు.