ఎంసీ హరి, మనోజ్, శశిధర్ లీడ్ రోల్స్‌లో వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘అమీర్ లోగ్’. రమణా రెడ్డి సోమ దర్శక నిర్మాతగా రూపొందించారు. ఆగస్టు 21న రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా ద్వారా రిలీజ్ అవుతోంది.
ఈ సందర్భంగా హీరోయిన్ వేద జలంధర్ మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో పక్కింటి అమ్మాయి తరహా పాత్ర పోషించా. మహిళలకు స్పూర్తినిచ్చేలా నా పాత్ర ఉంటుంది. నేను ‘తిమ్మరాజుపల్లి టీవీ’లో నటించినప్పటికీ ఆ విషయం మా డైరెక్టర్ గారికి తెలియదు. ఆడిషన్ చేసి నన్ను తీసుకున్నారు.
రమణారెడ్డి గారు చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. ప్రతీ సీన్, డైలాగ్ ఎలా ఉండాలి అన్నది క్లియర్‌గా వివరించేవారు. స్మరణ్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలోని అన్ని పాత్రలకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా, అన్ని ప్రాంతాల వారిని మెప్పించేలా సినిమా ఉంటుంది. ప్రీమియర్‌కు చక్కని ప్రశంసలు వచ్చాయి. డైరెక్టర్ వీఎన్ ఆదిత్య గారు రెగ్యులర్ పాత్రల్లా కాకుండా అందరికీ కనెక్ట్ అయ్యే పాత్రలా ఉందని మెచ్చుకున్నారు’ అని చెప్పింది.
