బీఈ, బీటెక్ అర్హతతో.. HALలో స్పెషలిస్ట్ ఖాళీలు.. ఈ జాబ్ వస్తే వెరీ లక్కీ!

బీఈ, బీటెక్ అర్హతతో.. HALలో స్పెషలిస్ట్ ఖాళీలు.. ఈ జాబ్ వస్తే వెరీ లక్కీ!

భారత ప్రభుత్వరంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్(హెచ్ఏఎల్) స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 02.

పోస్టులు: మెడికల్ స్పెషలిస్ట్ 04, జూనియర్ స్పెషలిస్ట్ 03.

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

వయోపరిమితి: మెడికల్ స్పెషలిస్ట్ పోస్టుకు గరిష్ట వయోపరిమితి 40 ఏండ్లు. జూనియర్ స్పెషలిస్ట్ పోస్టుకు గరిష్ట వయోపరిమితి 35 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

లాస్ట్ డేట్: జులై 02. 

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షకు 85శాతం, ఇంటర్వ్యూకు15 శాతం మార్కుల వెయిటేజీ ఉంటుంది.పూర్తి వివరాలకు  hal-india.co.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.