వర్షంలో తడవకుండా, బలమైన గాలుల్లో కూడా సేఫ్గా బయటికెళ్లాలంటే ఆటోమెటిక్‌ అంబ్రెల్లా !

వర్షంలో తడవకుండా, బలమైన గాలుల్లో కూడా సేఫ్గా బయటికెళ్లాలంటే ఆటోమెటిక్‌ అంబ్రెల్లా !

వర్షంలో తడవకుండా, బలమైన గాలుల్లో కూడా సేఫ్గా బయటికెళ్లాలంటే ఎనిఖొ కంపెనీ డిజైన్​ చేసిన ఈ గొడుగు చాలా బాగా పనికొస్తుంది. 54 ఇంచుల పెద్ద కవరేజీతో రూపొందించిన ఈ గొడుగు కింద ఇద్దరు వ్యక్తులు నిలబడొచ్చు. డబుల్- లేయర్ వెంటెడ్ కానోపీ ఉండటం వల్ల బలమైన గాలులు వీచినప్పుడు కూడా గొడుగు తలకిందులయ్యే అవకాశం తక్కువ. ఎనిమిది డబుల్ రిబ్స్‌‌తో కూడిన బలమైన ఫ్రేమ్ దీనికి అదనపు మన్నికను అందిస్తుంది.

వాటర్‌‌ప్రూఫ్ ఫ్యాబ్రిక్ వర్షపు నీటిని సమర్థంగా అడ్డుకోవడమే కాకుండా, ఎండలోనూ మంచి రక్షణ కల్పిస్తుంది. ఒక్క బటన్ నొక్కగానే ఆటోమేటిక్‌‌గా తెరుచుకునే వ్యవస్థ ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లో వెంటనే ఉపయోగించుకోవచ్చు.

కారబైనర్ హ్యాండిల్ ప్రత్యేక ఆకర్షణగా ఉండి, బ్యాగ్‌‌కు లేదా హుక్‌‌కు ఈజీగా తగిలించుకునే సౌకర్యాన్ని ఇస్తుంది. రోజూ ఆఫీస్‌‌కు వెళ్లే వారు, ప్రయాణాలు ఎక్కువగా చేసేవాళ్లు, వర్షాకాలంలో మన్నికైన ప్రీమియం గొడుగు కోరుకునే పురుషులు, మహిళలు ఇద్దరికీ ఇది ఉపయోగకరమైన ఎంపికగా చెప్పొచ్చు.