నెలసరి బాధలు తగ్గించే యోగ

నెలసరి బాధలు తగ్గించే యోగ

అమ్మాయిల్లో నెలసరి మొదలయ్యాక అనేక రకాల సమస్యలు. అధిక రక్తస్రావం, లేదంటే టైంకి రావపోవడం లాం టివి ఎక్కువగా వేధిస్తుంటాయి. నెలసరి అంటే చాలు చాలామందిలో ఏదో తెలియని భయం కూడా ఉంటుంది. కొంతమందికి ఆ టైంలో కడుపులో విపరీతమైన నొప్పి, వాంతులు, వికారం..మరికొందరికి పొట్ట బిగిసినట్టుంటుంది. ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు. కానీ ఈ ఆసనాలు ప్రయత్నిస్తే ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చు.

ప్రాణాయామం

సుఖాసనంలో కూర్చొని రెండు చేతులను చిన్ముద్రలో పెట్టాలి. ఇప్పుడు వెన్నెముకని నిటారుగా ఉంచి నాలుక చివరను అంగిలికి తాకించి ముక్కు ద్వారా మెల్లగా శ్వాస తీసుకుంటూ, బయటకు వదిలేస్తూ ఉండాలి. శ్వాస తీసుకునేటప్పుడు పొట్ట ముందుకు రావాలి.. శ్వాస వదిలేసేటప్పుడు పొట్ట లోపలికి పోవాలి. ఇలా మూడు నిమిషాలు చేయాలి. ఇలా చేయడం వల్ల నెలసరిలో వచ్చే అధిక ఒత్తిడి తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆసనాన్ని రోజూ వేయడం వల్ల పొట్టకు సంబంధించిన సమస్యలు కూడా దూరమవుతాయి.

నమస్కార ముద్రాసనం

నిటారుగా నిలబడి రెండు చేతులూ మెల్లగా పైకి తీసుకొచ్చి నమస్కార ముద్రలో ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ సాధ్యమైనంత వరకు వెనక్కి వంగాలి. చేతులు రెండు చెవుల పక్కన ఉండేలా చూసుకోవాలి. ఈ స్థితిలో సాధ్యమైనంత వరకు ఉండి నెమ్మదిగా శ్వాసతీసుకుంటూ మొదటి పొజిషన్ కి రావాలి. ఇలా మూడు సార్లు చేయాలి. ఈ ఆసనం వేయడం వల్ల పొట్ట దగ్గర కండరాలు పూర్తిగా స్ట్రెచ్ అవుతాయి. నెలసరి సక్రమంగా రానివాళ్లకి.. నెలసరిలో ఎక్కువగా రక్తస్రావం అయ్యేవాళ్లకి ఈ ఆసనం చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఆసనం వల్ల నెలసరి సమయంలో వచ్చే నడుము నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

పార్శ్వకోణాసనం

నిటారుగా నిలబడి రెండు కాళ్లనూ స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు కుడి పాదాన్ని కుడి వైపుకి తిప్పాలి. కుడి మోకాలిని 90 డిగ్రీల కోణంలో వంచాలి. ఇప్పుడు కుడి చేతిని ఫొటోలో చూపిన విధంగా వెనక్కి తీసుకెళ్లాలి. ఎడమ చేతిని నడుము వెనుక నుంచి రానిచ్చి రెండు చేతులు లాక్ చేసి పట్టు కోవాలి. ఇప్పుడు తలపైకి ఎత్తి పైకి చూడాలి. ఈ ఆసనంలో 20 సెకన్లు ఉండి తర్వాత యథాస్థితికి వచ్చి 10 సెకన్లు విరామమిచ్చి మళ్లీ మరొక కాలితో ఆసనాన్ని ప్రయత్నిం చాలి. ఈ ఆసనం నెలసరి సమస్యలతో పాటు గర్భాశయ సమస్యలున్న వారికి కూడా మేలు చేస్తుంది.

మత్స్యాసనం

మొదట పద్మాసనంలో కూర్చోవాలి. ఇప్పుడు కుడి పాదాన్ని ఎడమ తొడమీద, ఎడమపాదాన్ని కుడి తొడ మీద ఉంచాలి. తరువాత నెమ్మదిగా రెండు మోచేతులను వెనక్కి పెట్టాలి. మెల్లగా వెనక్కు వాలి తలను నేలమీద ఉంచే ప్రయత్నం చేస్తూ మాడుని నేలకు ఆనిం చాలి. ఈ ఆసనంలో ఉన్నప్పుడు శ్వాసను మామూలుగా తీసుకుని వదులుతూ 20 నుంచి 30 సెకన్ల పాటు ఉండాలి. తల మీద ఎక్కువ బరువు వేయకూడదు. ఈ ఆసనం బాగా అలవాటయ్యేదాకా ఆరుసార్లు దీర్ఘంగా శ్వాసతీసుకుని వదలాలి. దీనివల్ల ఛాతిలో, భుజాల్లో , గొంతు దగ్గర ఒత్తిడి తగ్గుతుం ది. శ్వాస సంబంధ సమస్యలు అదుపులో ఉంటాయి. మానసిక ఒత్తిడి కూడా అదుపులో ఉంటుంది. పక్కటెముకలు, కండరాలు సాగి బలంగా తయారయ్యి నెలసరిలో వచ్చే నొప్పి సమస్య అదుపులో ఉంటుంది. మోకాళ్ల నొప్పులున్న వాళ్లు ఈ ఆసనానికి దూరంగా ఉండాలి.

ఏక పాదాసనం

ఈ ఆసనం కోసం రెండు కాళ్లని స్ట్రెయిట్ గా ముందుకు చాపి కూర్చోవాలి. ఫొటోలో చూపిన విధంగా కుడి కాలిని కొంచెం పైకి లేపి ఎడమచేత్తో పట్టు కోవాలి. ఇప్పుడు వెన్నెముకని నిటారుగా ఉంచి, కుడి అరచేతిని నేలకు ఆనించి కూర్చోవాలి. నడుము, చేతులు, భుజాలు కుడి వైపుకి తీసుకురావాలి. ఇలా చేసేటప్పుడు నడుము బాగా మెలితిరుగుతుంది. ఈ ఆసనంలో అర నిమిషం పాటు ఉండి తర్వాత మొదటి పొజిషన్ కి రావాలి. మళ్లీ ఎడమకాలితో ఆసనాన్ని వేయాలి. రెండు కాళ్లతో ఆరుసార్లు ఆసనం వేయాలి. ఈ ఆసనం వల్ల నెలసరిలో రక్తస్రావం అదుపులో ఉంటుంది . అలాగే వికారం, వాంతులు లాంటివి కూడా తగ్గుతాయి.