పెదాలు ఎండిపోయి, పగిలిపోతుంటే మనం ఏం చేస్తాం? వెంటనే లిప్ బామ్ రాసుకుంటాం కదా! అయితే ఆ పెదాలు ఎందుకు పగులుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? పెదాలు పగలడానికి కారణాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
తనకు కావాల్సిన నీళ్లను చర్మం నుంచి తీసుకొని బాడీ హైడ్రేటెట్గా ఉండటానికి ప్రయత్నిస్తుంది.అలాంటప్పుడే చర్మం పొడిగా మారుతుంది. ఆ క్రమంలోనే పెదాలు కూడా పగులుతాయి. పెదాలు పగులుతున్నాయంటే శరీరానికి సరిపడా నీళ్లు అందడం లేదని అర్థం. అందుకే రోజుకి మూడున్నర నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి. స్కిన్ ప్రొడక్ట్ పడటం లేదంటే దాన్ని పక్కన పెట్టాలి. పెట్రోలియం జెల్లీ లాంటి ప్రొడక్ట్స్ వాడాలి. స్కిన్ ప్రొటక్షన్ ఫ్యాక్టర్ ఉన్న లిప్ బామ్ వాడాలి. కొబ్బరి నూనె, ఆల్మండ్ ఆయిల్ కూడా బాగా పనిచేస్తాయి. పెదాలు కొరకడం, నాలుకతో తడపడం లాంటివి మానాలి.
పెదాలు పగలడానికి కారణాలు
- పౌష్టిక ఆహారం తీసుకోకపోవడం వల్ల విటమిన్లు సరిగ్గా అందకపోవడం.
- పెదాలను నాలుకతో తరచూ తడుపుతూ ఉండటం.
- వాతావరణం (ఎండాకాలం, చలికాలం పెదాలు ఎక్కువగా పగులుతాయి)
- ఏదైనా ప్రొడక్ట్ పడకపోవడం.
- డీ హైడ్రేషన్.
- వీటిల్లో మనం తక్కువగా పట్టించుకొనేది...
- 'డీ హైడ్రేషన్' గురించి మామూలుగానే నీళ్లు శరీరానికి ఎంతో అవసరం. మనం తాగే నీళ్ల కన్నా ఒంట్లోంచి బయటికెళ్లిపోయే నీళ్లే ఎక్కువైనప్పుడు..
