ఆదిపురుష్ సినిమా తీసి పెద్ద తప్పు చేశా

ఆదిపురుష్ సినిమా తీసి పెద్ద తప్పు చేశా

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), కృతి సనన్(Kriti Sanon) మెయిన్ లీడ్స్ లో రామాయణం(Ramayanam) గాద ఆధారంగా తెరకెక్కిన మూవీ ఆదిపురుష్. సైఫ్ అలీఖాన్(Saif Alikhan) రావణాసురుడిగా నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 16న థియేటర్స్ లోకి వచ్చింది. ముందు నుంచి ఈ సినిమాని రామాయణం ఆధారంగా తీసుకొని చేస్తున్నాం అని ప్రమోట్ చేశారు టీమ్. తీరా సినిమాలో మాత్రం ఆ ఛాయలు కనపడకపోవడంతో ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిపురుష్ సినిమాపై, డైరెక్టర్ ఓం రౌత్ పై, రచయిత మనోజ్ పై తీవ్ర విమర్శలు చేశారు.

తాజాగా ఆదిపురుష్ సినిమా గురించి, సినిమా రిజల్ట్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు రచయిత మనోజ్ ముంతషీర్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆదిపురుష్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఆదిపురుష్ సినిమాను మంచి ఉద్దేశ్యంతో తీశాము కానీ.. తీసిన విధానం తప్పు. ఇది అంగీకరించడం వల్ల నేను తక్కువ కాను. ప్రతి సినిమాకి ఓ కథనం ఉంటుంది. దాని గురించి సినిమా మొదలుపెట్టే ముందే ఆలోచిస్తాము. మేము ఈ సినిమా చేస్తున్నప్పుడు యువకులను, పిల్లలను టార్గెట్ గా పెట్టుకున్నాము. ఇప్పుడు మేము చేసిన తప్పు మాకు అర్థమైంది.. అని చెప్పుకొచ్చారు మనోజ్. ప్రస్తుతం మనోజ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.