Xiaomi స్మార్ట్ TV లపై రూ. 17వేల భారీ డిస్కౌంట్..

Xiaomi స్మార్ట్ TV లపై రూ. 17వేల భారీ డిస్కౌంట్..

Xiaomi తన కస్టమర్లకోసం సరసమైన ధరకే ఉత్పత్తులను విడుదల చేసింది. ఫోన్ లే కాకుండా, ప్రజలు Xiaomi, Redmi టీవీలను కూడా ఇష్టపడతారు. ప్రతి ఒక్కరూ తక్కువ ధరలో ఉత్తమ ఫీచర్లను ఇష్టపడతారు. అయితే డీల్ ప్రకారం కంపెనీ తన ఉత్పత్తులను చౌకధరలో అందుబాటులో ఉంచుతోంది. Xiaomi TV 5A ని 33 శాతం తగ్గింపు ఇస్తోంది. రూ. 35,999 ఒరిజినల్ ధర ఉన్న Xiaomi TV 5A ని కేవలం రూ. 23,999 కి అందిస్తోంది. ఇది కాకుండా అదనంగా దానిపై రూ. 5000  డిస్కౌంట్ ఇస్తోంది. 

ICICI నెట్ బ్యాంకింగ్ లావాదేవీలపై రూ. 2వేలు ICICI బ్యాంకు కార్డులపై రూ. 1,500 డిస్కౌంట్ కూడా ఉంటుంది. Xiaomi TV 5A 32,40,43 అంగుళాల మూడు సైజుల్లో లభిస్తోంది. ఇందులో Full HD డిస్ స్లే ఉండటం విశేషం. Xiaomi స్మార్ట్ TV 5A సిరీస్ లోని 32అంగుళాల మోడల్ HD రిజల్యూషన్ తో వస్తుంది. 40 అంగుళాలు, 43 అంగుళాల స్మార్ట్ టీవీలు Full HD రెజల్యూషన్ తో వస్తున్నాయి. Xiaomi వివిడ్ పిక్చర్ ఇంజిన్ ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్ మూడు స్మార్ట్ టీవీలలో వినియోగించబడింది. ఇది కస్టమర్లకు అద్భుతమైన రంగు, కంటెంట్ కాంట్రాస్ట్ ని ఇస్తుంది. 

ఆడియే విషయానికొస్తే .. 40 అంగుళాల, 43 అంగుళాల టీవీలలో 24W స్పీకర్ టాప్ అందుబాటులో ఉంది. 32 అంగుళాల మోడల్ లో 20 W స్పీకర్ ఉంటుంది. Dolby ఆడియో, DTS-X, DTS-X వర్చువల్ మూడు స్మార్ట్ టీవీలలో మద్దతునిస్తాయి. 
Xiaomi Smart TV 5A సిరీస్ ఆండ్రాయిడ్ TV11 ఆధారంగా Xiaomi  Patchwall UI  లో పనిచేస్తుంది. ఇందులో గూగుల్ అసిస్టెంట్ క్రోమోకాస్ట్, గూగుల్ ప్లే స్టోర్ కు సపోర్ట్ చేస్తుంది.