కన్నడ రాకీ బాయ్ యశ్ నటించిన లేటెస్ట్ మూవీ 'టాక్సిక్' (Toxic) టాక్ చుట్టూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడుస్తోంది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో ఆయన స్టార్‌డమ్‌పై మళ్లీ హాట్ డిబేట్ మొదలైంది. యశ్ ఇమేజ్ కేవలం ఒక్క 'కేజీఎఫ్' (KGF) సినిమాతోనే వచ్చిందా? అసలు ఆ ఫ్రాంచైజీకి ముందు అతనెవరు? అంటూ కొందరు పాత మాటలను మళ్ళీ తోడుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చేసిన 'KGF కి ముందు యశ్ ఎవరు?' అనే సంచలన వ్యాఖ్యలు మళ్లీ నెట్టింట వైరల్‌గా మారాయి.
నా కొడుకు ఉగ్రవాది కాదు..
ఈ వ్యాఖ్యలపై యశ్ తల్లి పుష్ప అరుణ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడుతూ కౌంటర్ ఇచ్చారు. నా కొడుకు ఏమీ ఉగ్రవాది కాదు.. అందరిలా ధనిక కుటుంబంలో పుట్టలేదు. ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్ కొడుకుగా పుట్టి, తన సొంత కష్టంతో ఈ స్థాయికి ఎదిగాడు అని స్పష్టం చేశారు. యశ్‌కు KGFతోనే గుర్తింపు వచ్చిందనే ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.
KGF కి ముందే నా కొడుకు కన్నడ ఇండస్ట్రీలో వరుసగా 5 బ్లాక్‌బస్టర్ హిట్లు ఇచ్చి సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. గుగ్లీ, డ్రామా, మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి లాంటి సినిమాలతో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. KGF అతడి రేంజ్‌ను దేశవ్యాప్తంగా పెంచింది తప్ప, రాత్రికి రాత్రే హీరోను చేయలేదు. ఇప్పుడు అందరూ అతడిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు అని యశ్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
అసలు వివాదం ఏంటంటే?
గతంలో అల్లు అరవింద్ ఓ ఈవెంట్ లో సినిమాల బడ్జెట్లు, హీరోల రెమ్యునరేషన్ల గురించి మాట్లాడుతూ.. సినిమా స్కేల్, ప్రొడక్షన్ వాల్యూస్ వల్లనే స్టార్ ఇమేజ్ వస్తుందని చెప్పే క్రమంలో 'KGF కంటే ముందు యశ్ ఎవరు?' అని ఉదాహరణగా వ్యాఖ్యానించారు. 'టాక్సిక్' టాక్ బయటకు రావడంతో యాంటీ ఫ్యాన్స్ ఈ పాత కామెంట్స్‌ను మళ్లీ తెరపైకి తెచ్చారు.
ఇక గతంలో యశ్ కూడా ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. సినిమా విజయం అనేది కేవలం ప్రొడ్యూసర్ లేదా హీరో వల్లనే రాదు, వందల మంది కష్టం. అయితే ప్రధాన పాత్ర పోషించే నటుడు ఆ కథను సరిగ్గా మోయలేకపోతే సినిమా గెలవదు అని మెచ్యూర్డ్‌గా బదులిచ్చారు. ప్రస్తుతం యశ్ అభిమానులు కూడా 'రాకీ భాయ్ బ్రాండ్ ఒక్క రోజులో వచ్చింది కాదు' అంటూ ఆయన పాత రికార్డులను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు...
Hero #Yash paina Producer #AlluAravind gari comments.. Vaatiki Yash thalli #Pushpa gari Reaction pic.twitter.com/LIL5GTyLil
— Milagro Movies (@MilagroMovies) August 30, 2026
