యశ్ గురించి కాదు.. ముందు మీ హీరోల గురించి మాట్లాడు.. యశ్ ఫ్యాన్స్ షాకింగ్ కామెంట్స్

యశ్ గురించి కాదు.. ముందు మీ హీరోల గురించి మాట్లాడు.. యశ్ ఫ్యాన్స్ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్(Allu aravind) కన్నడ స్టార్ హీరో యశ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఆయన కోటబొమ్మాళి పీఎస్ సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్ కు హాజరయ్యారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు అల్లు అరవింద్. ఇందులో భాగంగా ఒక విలేకరి.. కొంతకాలంగా గీతా ఆర్ట్స్ సంస్థ నుంచి చిన్న సినిమాలు తప్ప పెద్ద సినిమాలు రావడం లేదు ఎందుకు? దానికి సినిమాల బడ్జెట్ పెరిగిపోవడమే కారణమా? ఆ లెక్కన చూసుకంటే మీ ఫ్యామిలీ నుండి ఉన్న హీరోలు కూడా భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు కదా.. అని ప్రశ్నించారు.  

దానికి సమాధానంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పెరిగిన సినిమా నిర్మాణ వ్యయంలో హీరోలు తీసుకునేది 20 నుంచి 25 శాతం మాత్రమే. కాబట్టి హీరోల వల్ల సినిమాల కాస్ట్ పెరిగింది అనడం కంటే.. నిర్మాణ వ్యయం పెరిగిన సినిమాల్లో హీరోలు ఉంటున్నారు అని అనడం కరక్ట్. పేర్లు చెప్పడం బాగోదు.. కొన్ని సినిమా నిర్మాణ వ్యయాల్లో హీరోల రెమ్యునరేషన్లు ఎంతున్నాయో మీరు లెక్కేసుకోండి. చాలా మేరకు తక్కువగానే ఉన్నాయి. ఆడియన్స్ కూడా పెద్దగా చూపిస్తేనే పెద్ద సినిమాలను ఆదరిస్తారు. ఉదాహరణకి..  కె.జి.యఫ్ ముందు యశ్ ఎంత పెద్ద హీరో? సినిమాను పెద్దగా చూపించారు కాబట్టే ఆ సినిమా ఆ రేంజ్ లో ఆడింది.. అని చెప్పుకొచ్చారు అల్లు అరవింద్.

అల్లు అరవింద్ చేసిన ఈ కామెంట్స్ పై యశ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కేజీఎఫ్ మూవీ కేవలం యశ్ వల్లే ఆడింది, యశ్ లేకుండా కేజీఎఫ్ సినిమా ఊహించుకోలేం, అల్లు అరవింద్ యశ్ గురించి మాట్లాడేముందు.. తన ఇంట్లో ఉన్న హీరోల గురించి మాట్లాడాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.