మా హీరోని అలా అంటారా.. రవితేజపై దారుణమైన ట్రోల్స్ చేస్తున్న యష్ ఫ్యాన్స్

మా హీరోని అలా అంటారా.. రవితేజపై దారుణమైన ట్రోల్స్ చేస్తున్న యష్ ఫ్యాన్స్

మాస్ మహారాజ రవితేజ(Raviteja)పై కేజీఎఫ్(Kgf) హీరో యష్(Yash) ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. తమ అభిమాన హీరోని అలా అంటారా అంటూ మండిపడుతున్నారు. వాటికి కౌంటర్ గా రవితేజ ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైందంటే. 

రవితేజ హీరోగా వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara rao). దర్శకుడు వంశీ(Vamsee) తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ దసరా కానుకగా థియేటర్లలోకి రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా అన్ని భాషల్లో ఈ సినిమాను ప్రమోట్ చేసే పనిలో పడ్డారు చిత్ర యూనిట్. ఇందులో భాగంగా రీసెంట్‌గా బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు రవితేజ. 

ఈ ఇంటర్వ్యూలో కన్నడ స్టార్ హీరో యశ్ గురించి అడిగారు యాంకర్. దానికి సమాధానంగా రవితేజ.. యాష్ చేసిన కేజీఎఫ్ సినిమా మాత్రమే చూశాను. అలాంటి సినిమా రావడం యష్ అదృష్టం.. అని చెప్పుకొచ్చారు. రవితేజ చేసిన ఈ కామెంట్స్ ను తీసుకోలేకపోతున్నారు యష్ ఫ్యాన్స్. దీంతో ఆయనపై దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు. నిజానికి కేజీఎఫ్ మినహాయిస్తే తెలుగు ప్రేక్షకులకు యాష్ గురించి, ఆయన గత సినిమాల గురించి పెద్దగా తెలీయదు. రవితేజ కూడా అదే ఉద్దేశంతో అన్నారు. రవితేజను తప్పుగా అర్థం చేసుకున్న యష్ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్ కు రవితేజ ఏమైనా స్పందిస్తారో చూడాలి.