అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టేలా రామాయణ మేకింగ్

అంతర్జాతీయ వేదికలపై  నిలబెట్టేలా రామాయణ మేకింగ్

రణ్‌‌‌‌‌‌‌‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటించిన  చిత్రం ‘రామాయణ’.  నితేష్ తివారీ  దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని    ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సమర్పణలో, డి‌‌‌‌‌‌‌‌నెగ్, మాన్‌‌‌‌‌‌‌‌స్టర్ మైండ్ క్రియేషన్స్ భాగస్వామ్యంతో  నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్‌‌‌‌‌‌‌‌తో నిర్మిస్తున్నారు.  రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ  ఫస్ట్ పార్ట్‌‌‌‌‌‌‌‌ దీపావళి సందర్భంగా నవంబర్ 5న పాన్‌‌‌‌‌‌‌‌ ఇండియా వైడ్‌‌‌‌‌‌‌‌గా రిలీజ్‌‌‌‌‌‌‌‌ కానుంది. 

తాజాగా బెంగళూరులో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌ను నిర్వహించారు.  అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, భారీ యుద్ధ సన్నివేశాలు, రామ–రావణ పాత్రల మధ్య యుద్ధంతో సాగిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఇందులో  యశ్ రావణుడిగా,  సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా  కనిపించి ఆకట్టుకున్నారు.  

ఈ సందర్భంగా  రణ్‌‌‌‌‌‌‌‌బీర్ కపూర్ మాట్లాడుతూ ‘శ్రీరాముడి పాత్రలో లీనమై, ఎంతో ఏకాగ్రతతో నటించా.  దైవ సంబంధమైన పాత్రలు పోషించేటప్పుడు అహంకారానికి తావులేకుండా, ఆ పాత్రల పట్ల గౌరవంతో వ్యవహరించాలి’ అని చెప్పాడు.  భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికలపై  నిలబెట్టే చిత్రమిది అని యశ్ అన్నాడు. సీతమ్మ పాత్రలో నటించడం తనకు దక్కిన గొప్ప అదృష్టమని సాయి పల్లవి  చెప్పింది. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన  చిత్రంలో శూర్పణఖ పాత్రలో భాగమవడం ఆనందంగా ఉందని రకుల్ ప్రీత్‌‌‌‌‌‌‌‌సింగ్ చెప్పింది.  ఏ.ఆర్. రెహమాన్, హన్స్ జిమ్మర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.