బాక్సాఫీస్ దగ్గర 'టాక్సిక్' ఇంగ్లీష్ వెర్షన్ డిజాస్టర్.. తొలిరోజు కేవలం 450 టికెట్లే సేల్!

బాక్సాఫీస్ దగ్గర 'టాక్సిక్' ఇంగ్లీష్ వెర్షన్ డిజాస్టర్.. తొలిరోజు కేవలం 450 టికెట్లే సేల్!

కన్నడ స్టార్ హీరో నటించిన భారీ యాక్షన్ మూవీ 'టాక్సిక్' భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చింది. అయితే తొలి రోజు ఓపెనింగ్ ఆదుర్స్ అనిపించినా.. తర్వాత రోజు నుంచి కలెక్షన్స్ క్రమంగా పడిపోయాయి. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ చిత్రంపై రిలీజ్ కాకముందు ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయో, రిలీజ్ అయ్యాక అంతటి ప్రతికూల ప్రచారాన్ని మూటగట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశపరిచింది. 

ఈక్రమంలో ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు రప్పించేందుకు ఇంగ్లీష్ వెర్షన్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కానీ నిర్మాత ప్లాన్ ఘోరంగా తిరగబడింది. వారి అంచనాలను తల్లకిందుల చేసింది. సెప్టెంబర్ 4న టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ ను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. కానీ ఇంగ్లీష్ వెర్షన్ ను చూసేందుకు ప్రేక్షకులు అస్సలు ఆసక్తి చూపలేదు. దేశవ్యాప్తంగా తొలి రోజు కేవలం 450 టికెట్లు మాత్రమే అమ్ముడవడం అందరినీ షాకింగ్ కు గురిచేసింది. 

ఈ చిత్రం ఒరిజనల్ వెర్షన్ 3 గంటల 14 నిమిషాల నిడివి . అయితే ఈ ఒరిజినల్ వెర్షన్‌ను దాదాపు 17 నిమిషాలు ట్రిమ్ చేసి, 2 గంటల 57 నిమిషాల నిడివితో ఇంగ్లీష్‌లోకి తెచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. ముంబై, బెంగళూరులలో కొద్దిపాటి ఆక్యుపెన్సీ నమోదు. తొలి రోజు ఇంగ్లీష్ వెర్షన్ లో మొత్తం వసూళ్లు రూ. 1.40 లక్షలు మాత్రమేనని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.  గురుగ్రామ్, నోయిడా వంటి ప్రాంతాల్లో కలిపి 25 కంటే తక్కువ టికెట్లు అమ్ముడవడం మరింత షాక్ కు గురిచేస్తుంది. కనీసం రూ. 10 లక్షల మార్కును చేరుకోవడం కూడా ఈ వెర్షన్‌కు గగనమే అన్న టాక్ వినిపిస్తోంది

ALSO READ : 'జనవరి 12 విడుదల' సెట్స్‌పై లీకుల కలకలం..

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు రూ. 331 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.  రోజురోజుకు ఈ సినిమా అన్ని భాషల వసూళ్లు తీవ్రంగా పడిపోతున్నాయి. సెప్టెంబర్ 4న అన్ని భాషల్లో కలిపి కేవలం రూ. 1.50 - 1.60 కోట్లు మాత్రమే రాబట్టింది. అందులో కన్నడ వెర్షన్ రూ. 75-80 లక్షలు, హిందీ వెర్షన్ రూ. 70-75 లక్షలు వసూలు చేశాయి. సెప్టెంబర్ 3న రూ. 2.54 కోట్లు సాధించిన హిందీ వెర్షన్, శుక్రవారం నాటికి దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం హిందీ తొలి వారం వసూళ్లు రూ. 130.09 కోట్ల వద్ద స్థిరపడ్డాయి.

యాక్షన్ కంటే ఎమోషన్, డ్రామా ఎక్కువైందన్న విమర్శలు ఒకవైపు ఉన్నప్పటికీ... కేవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషీ వంటి భారీ తారగణం ఉంది. అయితే ఈ వీకెండ్ (సెప్టెంబర్ 5, 6) లోనూ ఇదే సీన్ కొనసాగితే ఇంగ్లీష్ వెర్షన్ షోలను థియేటర్ల నుంచి పూర్తిగా ఎత్తేసే పరిస్థితులు కనిపిస్తున్నాయని టాక్ వినిపిస్తోంది.