యష్ తేజ్, జయశ్రీ కొత్త చిత్రం ప్రారంభం

యష్ తేజ్, జయశ్రీ కొత్త చిత్రం ప్రారంభం

యష్ తేజ్, జయశ్రీ జంటగా చందు దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రం రూపొందుతోంది. ఆర్ఎన్ క్రియేషన్స్ సమర్పణలో సుజయ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కె గోపాల్, జె రవీందర్ నిర్మిస్తున్నారు. బుధవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా, దర్శకుడు విఎన్ ఆదిత్య క్లాప్ కొట్టారు. 

మామిడి హరికృష్ణ స్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌ను  చిత్ర యూనిట్‌‌‌‌‌‌‌‌కు అందజేశారు. ప్రేమలో ఉన్న యువత తమ తల్లిదండ్రులను దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌తో ఈ సినిమా ఉండబోతోందని దర్శకుడు చందు చెప్పారు. సరికొత్త ప్రేమకథా చిత్రంగా ఇది నిలవబోతోందని నిర్మాతలు కె గోపాల్, జె రవీందర్ తెలియజేశారు.