Toxic Day 1 Collection: యష్ దెబ్బకు బాలీవుడ్ బడా హీరోలు కూడా వెనక్కి.. తొలి రోజు 'టాక్సిక్‌' ఎన్నికోట్లు రాబట్టిందంటే?

Toxic Day 1 Collection: యష్ దెబ్బకు బాలీవుడ్ బడా హీరోలు కూడా వెనక్కి.. తొలి రోజు 'టాక్సిక్‌' ఎన్నికోట్లు రాబట్టిందంటే?

కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' భారీ అంచనాల మధ్య ఆగస్టు 26న  థియేటర్లలోకి వచ్చింది. తొలి రోజు బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకున్నప్పటికీ గట్టిగానే వసూళ్లు రాబట్టింది. ప్రముఖ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రూ. 140 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రికార్డులను తిరగరాసింది.

తొలి రోజే.. రూ. 140 కోట్లు..

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. 'టాక్సాక్' తొలిరోజే  ఇండియాలో గ్రాస్ రూ. 120 కోట్లు రాబట్టింది. ఒక్క హిందీ వర్షన్ నుంచే రికార్డు స్థాయిలో రూ. 55 కోట్లు రాగా, కన్నడ నుంచి రూ. 25 కోట్లు, తెలుగు నుంచి రూ. 11 కోట్లు వసూలయ్యాయి.
మొత్తానికి తొలి రోజు  రూ. 101 కోట్ల నెట్ ను రాబట్టి రూ. 100 కోట్ల మార్క్‌ను దాటేసింది.  బాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టేసింది.

బాలీవుడ్ రికార్డుల గల్లంతు..

2026లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో 'ధురందర్ 2'  ( రూ. 103 కోట్ల నెట్ ) తర్వాత స్థానంలో 'టాక్సాక్' నిలిచింది. ప్రపంచవ్యాప్త వసూళ్లలో షారుఖ్ ఖాన్ 'జవాన్' (రూ. 129 కోట్లు), 'పఠాన్' (రూ. 104 కోట్లు), రణబీర్ కపూర్ 'యానిమల్' (రూ. 116 కోట్లు), ప్రభాస్ 'ఆదిపురుష్' (రూ. 127 కోట్లు) చిత్రాల తొలిరోజు రికార్డులను టాక్సిక్ దాటేసింది. ఇక 'కె.జి.ఎఫ్ 2' (రూ. 164 కోట్లు) తర్వాత కన్నడ పరిశ్రమలో సెకండ్ బిగ్గెస్ట్ వరల్డ్‌వైడ్ ఓపెనింగ్‌ సాధించిన చిత్రంగా చరిత్రకెక్కింది

సెన్సార్ బోర్డ్ నుంచి ఎటువంటి కట్స్ లేకుండా 'A' సర్టిఫికెట్ పొందిన ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా వంటి భారీ తారాగణం నటించింది. ఇందులో చూపించిన ఇంటెన్స్ యాక్షన్, బోల్డ్ సన్నివేశాలు సామాజిక మాధ్యమాల్లో తీవ్రమైన చర్చకు దారితీశాయి. ప్రేక్షకులు, క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ, మొదటి రోజు వచ్చిన ఈ సునామీ లాంటి కలెక్షన్లు యష్ బాక్సాఫీస్ స్టామిటాను మరోసారి నిరూపించాయి. రాబోయే రోజుల్లో 'టాక్సిక్' మరిన్ని కొత్త రికార్డులను సృష్టించడం ఖాయం అని మూవీ టీమ్ ధీమా వ్యక్తం చేస్తోంది.