Yatra 2 Movie : రంగం సర్వం సిద్ధం భయపడమ్..యాత్ర 2 తొలి సమరం సాంగ్

Yatra 2 Movie : రంగం సర్వం సిద్ధం భయపడమ్..యాత్ర 2 తొలి సమరం సాంగ్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాజకీయ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మూవీ యాత్ర. మహి వి రాఘవ్ తెరెకక్కించిన ఈ సినిమా 2019లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. దానికి సీక్వెల్గా యాత్ర 2 (Yatra 2) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వైఎస్ మరణాంతరం ఆయన కుమారుడు జగన్మోహన్‌ రెడ్డి పొలిటికల్ జర్నీ నేపథ్యంలో యాత్ర 2 తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో వై ఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ హీరో జీవా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.ఇప్పటికే సినిమా నుంచి పోస్టర్స్ మరియు టీజర్తో పాటు ఇటీవల ఫస్ట్ సింగిల్ ‘చూడు నాన్న’ అనే సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ ఫాదర్ సెంటిమెంట్తో ఎంతో ఎమోషనల్గా సాగింది. 

లేటెస్ట్గా ఈ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. తొలి సమరం(Tholi Samaram)..దమ్మే దమ్ దమ్ సన్నద్ధం..రంగం సర్వం సిద్ధం భయపడమ్..దమ్మే ధర్మంగా అడుగేద్దాం..దమ్మెంతో చూపిద్దాం..తళపడదమ్ అంటూ సాగే వీడియో సాంగ్లో వైఎస్ జగన్ (జీవా) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం, పార్టీ తరపున ఎన్నికల శంఖారావం పూరించడం, ప్రచారంలో పార్టీ గుర్తు ఫ్యాన్ ని ప్రదర్శించడం వంటి సీన్స్ ఆకట్టుకుంటున్నాయి.

ఈ పాటలో ఆయన జీవా పలికించిన భావోద్వేగాలు ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టుకుంటాయి.సంతోష్ నారాయణ్ స్వరపరిచిన ఈ పాటను సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి రచించగా గౌతమ్ భరధ్వాజ్ ఆలపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.రీసెంట్గా జగన్ ఎన్నికలకు సిద్ధం అంటూ శంఖం పూరించగా..ఏపీలో రాజకీయం చాలా వేడిగా ఉంది. ఈ తరుణంలోనే ఈ సాంగ్ రిలీజ్ అవ్వడం..జగన్ ఫ్యాన్స్ కి బెస్ట్ ట్రీట్ అని చెప్పుకోవాలి. త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 8న విడుదల కానుంది.