Yatra 2: వైఎస్ భారతి పోస్టర్ వైరల్..అచ్చం ఆమెలా ఉన్న ఈ అమ్మడు ఎవరు?

Yatra 2: వైఎస్ భారతి పోస్టర్ వైరల్..అచ్చం ఆమెలా ఉన్న ఈ అమ్మడు ఎవరు?

దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి(YS Rajashekhara reddy) జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర(Yatra). ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా యాత్ర2 (Yatra) ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మహి వీ రాఘవ్(Mahi V Raghava). వైఎస్ మరణాంతరం ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jaganmohan reddy) జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలు, కీలక సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో వైఎస్‌ జగన్‌ పాత్రలో తమిళ హీరో జీవా నటించనున్నారు. ఆయన ఫస్ట్ లుక్ ను కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు మేకర్స్. దానికి ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.  

లేటెస్ట్గా ఈ సినిమా నుంచి ఏపీ సీఎం జగన్ సతీమణి భారతి రెడ్డి(YS Bharathi Reddy) బర్త్డే స్పెషల్గా ఆమె క్యారెక్టర్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు. మరాఠీ యాక్టర్ కేతకి నారాయణ్ భారతి పాత్రలో కనిపించబోతోంది. చూడగానే వైఎస్ భారతి అనేంతలా కేతకి పోస్టర్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం వైఎస్ భారతి పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అంతేకాకుండా..వైసీపీ ఫాలోవర్స్ ఈ ఫోటోని ట్వీటర్ పేజీలలో షేర్ చేస్తూ తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఈ పోస్టర్లో ఇంటరెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చారు. 'నిజమేన్నా మా ఇంట్లో ఆడాళ్ళకి రాజకీయాలు, వ్యాపారాలు నేర్పించలేదు. అట్లానే మాకు కష్టం, సమస్య వస్తే భయపడి వెనుతిరిగి చూడటం కూడా నేర్పించలేదు' అనే క్యాప్షన్ తో వైస్ భారతి పాత్రని సినిమాలో ఎంత పవర్ ఫుల్ గా చూపిస్తున్నారో మేకర్స్ చెప్పకనే చెప్పారు.

యాత్ర 2 కేతకి నారాయణ్ సినిమాల విషయానికి వస్తే..ఈమె ముంబై మోడల్. మలయాళం, మరాఠీ, తెలుగు, హిందీ సినిమాలలో నటిస్తోంది. యూత్ అనే మరాఠీ సినిమాతో సినిమా రంగంలోకి వచ్చింది. అనేక షార్ట్ ఫిల్మ్‌లు, మ్యూజికల్ ఆల్బమ్‌లలో కూడా నటించింది.

ప్రస్తుతం తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. రీసెంట్గా తెలుగులో ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్ అనేమూవీలో నటించింది. ప్రస్తుతం చేస్తోన్నయాత్ర 2 ఆమెకి రెండో మూవీ కావడం విశేషం. ఇప్పటికే డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు నాలుగు వెబ్ సిరీస్ లలో నటించింది. 

ఇక యాత్ర 2 మూవీ వచ్చే ఏడాది 2024 ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Beta
Beta feature