బాబు ఫెవికాల్ బాబా: విజయసాయిరెడ్డి ట్వీట్స్

బాబు ఫెవికాల్ బాబా: విజయసాయిరెడ్డి ట్వీట్స్

ఏపీ సీఎం  చంద్రబాబుపై  మరోసారి  విరుచుకుపడ్డారు  వైసీపీ  ఎంపీ విజయసాయిరెడ్డి.  ట్విటర్లో  బాబుపై  పంచ్ లు  వేశారు. ఢిల్లీలో  చంద్రబాబును అంతా  ఫెవికాల్  బాబా  అంటున్నారని  విమర్శించారు. పిలవని  పేరంటంలా అందరి ఇళ్లపై  పడి  ఫొటోలు  దిగుతున్నారని  ఆరోపించారు. వాళ్లను కలుపుతా…. వీళ్లతో  మాట్లాడతా  అంటుంటే  ఫెవికాల్ బాబా  అనే పేరు  పెట్టారని  చెప్పారు  విజయసాయిరెడ్డి.  UPA, మాయ,  అఖిలేష్ కూటమి కూడా  చతికిల  పడ్డాయన్నారు.

చంద్రబాబు  గ్రాఫ్ డమాల్  అనే విషయం వాళ్లకు  తెలుసన్నారు. లగడపాటి  సర్వేలు  చూపించబోతే…. వారు విసుక్కుంటున్నారని  చెప్పారు  విజయసాయిరెడ్డి . తెలుగు ప్రజల  ఆత్మగౌరవం కోసం పుట్టిన  టీడీపీ పార్టీని …సోనియాతో పాటు  ఉత్తరాది నేతల కాళ్ల  ముందు  పడేశారని  విమర్శించారు  విజయసాయి.