ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ నిజాయితీ

ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ నిజాయితీ
  • యాదగిరిగుట్ట డిపో ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ నిజాయితీ
  • ఖరీదైన స్మార్ట్ ఫోన్ మర్చిపోయిన ప్రయాణికుడు
  •  తిరిగిచ్చిన కండక్టర్ బుగ్గ స్వామి, డ్రైవర్ సోకం వెంకటయ్య

హైదరాబాద్: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ నిజాయితీ చాటుకున్నారు. బస్సులో ఓ ప్రయాణికుడు పోగొట్టుకున్న స్మార్ట్ ఫోన్ తిరిగి అందించారు. యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో బస్సు సోమవారం ఉదయం యాదగిరిగుట్ట నుంచి నారాయణఖేడ్ బయలుదేరింది. భువనగిరిలో ప్రయాణికుడు వినయ్  బస్సెక్కి సికింద్రాబాద్ లోని సంగీత్ బస్టాప్ లో దిగిపోయాడు.  బస్సు అక్కడి నుంచి జేబీఎస్ బస్టాండ్ వరకు వచ్చింది. అయితే తన స్మార్ట్ ఫోన్ ను బస్సులోనే పడిపోవడంతో ప్రయాణికుడు వెంటనే అదే ఫోన్ కు కాల్ చేశాడు. ఫోన్ మాట్లాడిన కండక్టర్ అతడిని జేబీఎస్ బస్టాండ్ కి రమ్మన్నాడు. జూబ్లీ బస్  స్టేషన్ మేనేజర్ సమక్షంలో ప్రయాణికుడికి అందజేశారు కండక్టర్, డ్రైవర్. ఖరీదైన మొబైల్ ను తిరిగి ఇచ్చినందుకు కండక్టర్‌, డ్రైవర్ నిజాయతీని అధికారులు ప్రశంసించారు. తన మొబైల్ ను తిరిగి ఇచ్చినందుకు ప్రయాణికుడు కండక్టర్, డ్రైవర్ కు ధన్యవాదాలు తెలిపాడు.