సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఎల్లమ్మ’. ‘బలగం’ ఫేమ్ వేణు యల్దండి దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు.
మార్చి 5న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుందని తెలియజేశారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. వైవిధ్యమైన కథ, కథనం, భావోద్వేగాలతో పాటు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యతను ఇస్తూ రూపొందిస్తున్నామని మేకర్స్ తెలియజేశారు. ఇందులో ‘పర్షి’ అనే పాత్రలో దేవిశ్రీ కనిపించనున్నాడు.
తన బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సంగీత దర్శకుడిగా మెప్పించిన దేవిశ్రీ నటుడిగా మారుతుండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది.
