హిందువులు జ్యోతిష్య శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. కొంతమంది ఆర్థిక ఇబ్బందులు.. ఆరోగ్య సమస్యలతో సతమతమవుతుంటారు. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లో కొన్ని రకాల మొక్కలు ఉంటే ఫైనాన్స్ ఇబ్బందులు వస్తాయి. ఆ చెట్ల వల్ల ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతాయని పండితులు చెబుతున్నారు. ఎలాంటి మొక్కలు ఇంటి ఆవరణలో ఉండకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఉండే వస్తువులు.. ఇంటి ఆవరణ ఎలా ఉంది..ఇంట్లో ఎఆంటి మొక్కలు ఉన్నాయి.. అనే అంశాలపై కూడా ఆధారపడి జీవితం ఉంటుంది. కొన్ని మొక్కలవల్ల సానుకూల పరిస్థితులు ఉంటే మరికొన్ని మొక్కల వల్ల చాలా ఇబ్బందులు వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంట్లొ కొన్ని మొక్కల వల్ల ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతాయి.
కొన్ని రకాల మొక్కలు ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవిని అడ్డుకుంటాయి. పాజిటివ్ శక్తి రాకుండా నిరోధిస్తాయి. దీని వలన శాంతికి.. ఐశ్వర్యానికి చాలా ఇబ్బందులు కలుగుతాయి. అందుకే కొన్ని చెట్లను ఇంటి ముందు లేదా పెరట్లో పెంచకూడదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
రేగి మొక్క: రేగి పండ్లు తినడానికి తియ్యగా.. పుల్లగా ఉంటాయి. ఇవి తింటుంటే రుచి సూపర్ గా ఉంటుంది. పైగా దీని ఆకులను వినాయకచవితి రోజు పూజలో పత్రిగా కూడా ఉపయోగిస్తారు. అయినా సరే .. ఈ మొక్క ఇంటి ఆవరణలో ఉంటే ప్రతికూల శక్తిని ఆహ్వానిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. పైగా ఈ చెట్టు ముళ్లతో ఉంటుంది. ఇది తగిలిందా అంటే చాలు.. పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. చిన్నగా.. మెత్తగా ఉండటం వల్ల గుచ్చుకుందా అంటే చాలు..శరీరంలో విరిగిపోతుంది.. ఇక బయటకు తీయాలంటే అది పెట్టే బాధ అంతా ఇంతా కాదు. పైగా ఈ చెట్టు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిండంతో ఇది ఉన్న ఇంటిలో నివసించు వారిపై దీని ప్రభావం ఉంటుంది. అలాంటి ఇంటిలో ఉండే వారికి ఆర్థిక ఇబ్బందులు పెరగడం, చిన్నచిన్న విషయాలకు గొడవలు రావడం వంటి సమస్యలు తలెత్తవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఒక్కోసారి భార్యాభర్తల మధ్య అభిప్రాయ బేధాలు తీవ్రస్థాయికి చేరుకొని విడిపోయే అవకాశం కూడా ఉందంటున్నారు. అందువల్ల ఈ చెట్టును ఖాళీ ప్రదేశాల్లో .. అడవుల్లో పెంచాలని పండితులు సూచిస్తున్నారు.
తుమ్మ చెట్టు : ఈ చెట్ట చాలా పెద్దదిగా ఉంటుంది. దీని నుంచి వచ్చే కొమ్మలను పెరటి చుట్టూ రక్షణగా కూడా కడతారు. దీని మళ్లు పెద్ద సైజులో.. ఉంటాయి. తుమ్మ చెట్టులో చాలా రకాలుంటాయి. ఏరకమైన తుమ్మ చెట్టు కూడా ఇంట్లో ఉండకూడదు. ఈ చెట్టు ఇంటి ఆవరణలో ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు వప్తాయి. తరచూ అనారోగ్య కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. తరచూ అనారోగ్య సమస్యలు రావడం, చికిత్సల కోసం అధిక ఖర్చులు కావడం వంటి పరిస్థితులు ర్పడవచ్చని చెబుతారు. అనవసర ఖర్చులు పెరగడం వల్ల కుటుంబంలో ఒత్తిడి పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.
పత్తి చెట్టు: ఈ మొక్కను ఇంట్లో పెంచితే ప్రతి విషయంలో కూడా అభివృద్ది కుంటుపడుతంది. వల్ల కుటుంబ ఎదుగుదల నెమ్మదిస్తుంది. అనవసరంగా డబ్బు ఖర్చవుతుంది. దీనిని పొలాల్లో తోటల్లో పెంచుకోవచ్చు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో పత్తి మొక్కలు పెంచడం అశుభాలకు కారణమౌతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితిలోనూ ఇళ్లల్లో పత్తి మొక్కలను పెంచకూడదని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
