మెగాస్టార్ని అలా అంటుంటే చాలా బాధేస్తుంది.. యంగ్ హీరో ఎమోషనల్ కామెంట్స్

మెగాస్టార్ని అలా అంటుంటే చాలా బాధేస్తుంది.. యంగ్ హీరో ఎమోషనల్ కామెంట్స్

యంగ్ హీరో కార్తికేయ గుమ్మికొండ(Karthikeya gummikonda) తేన ఫెవరెట్ హీరో మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi) గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన హీరోగా వస్తున్న బెదురులంక 2012(Bedurulanka 2012) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఈమేరకు కామెంట్స్ చేశారు. ప్రస్తుతం కార్తికేయ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే..  కార్తికేయ గుమ్మికొండ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ బెదురులంక. నేహా శెట్టి(Neha shetty) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ప్రముఖ ఛానెల్ లో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ హీరో. ఈ క్రమంలో యాంకర్ చిరంజీవి రీసెంట్ మూవీ భళా శంకర్ గురించి, దాని రిజల్ట్ గురించి అడిగారు. 

దానికి సమాధానంగా కార్తికేయ మాట్లాడుతూ.. సినిమాని సినిమాగా చూస్తే మంచిది. కానీ కొంతమంది చిరంజీవి గారిని కావాలని విమర్శిస్తూ ఉంటారు. ఆయన్ని అలా విమర్శిస్తుంటే చాలా బాధేస్తుంది. ఆయన చేసిన సినిమా నచ్చకపోతే.. నచ్చలేదు అని చెప్పడం వరకు ఓకే.. కానీ కొంతమంది కావాలని ఆయన్ని వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసి విమర్శిస్తున్నారు. అలాంటివారిది చిన్న మనస్తత్వం అనిపిస్తుంది. ఎవరైనా కథనచ్చే సినిమా తీస్తారు. అది అనుకున్నంత స్థాయిలో ఆడకపోతే నేరమా. చిరంజీవి గారు అయన కెరీర్‌లో ఎన్నో కష్టాలు, భాదలు ఎదుర్కొని నిలబడ్డారు. వాటి ముందు ఇది చాలా చిన్న విషయం. ఇలాంటి వాటిని ఆయన అస్సలు పట్టించుకోరు.. తన తరువాతి సినిమాపై దృష్టిపెడతారని కూడా అందరికీ తెలుసని చాలా ఎమోషనల్ గా చెప్పుకొచ్చారు కార్తికేయ.