మన చిరంజీవిని మనమే కాపాడుకోవాలి: కార్తికేయ గుమ్మికొండ

మన చిరంజీవిని మనమే కాపాడుకోవాలి: కార్తికేయ గుమ్మికొండ

యంగ్ హీరో కార్తికేయ గుమ్మికొండ(Karthikeya gummikonda) మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు. ఆయనొక అపురూపమైన వ్యక్తి అని ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది అని చెప్పుకొచ్చారు కార్తికేయ. ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సంధర్బంగా ఆయన ఫ్యాన్స్ మెగా ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ఇండస్ట్రీ నుండి చాలా మంది అటెండై చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 

ఇందులో భాగంగా యంగ్ హీరో కార్తికేయ గుమ్మికొండ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి సాధించిన ప్రతీది ఆయన స్వంతంగా కష్టపడి సాధించినవే. సినిమా అంటే ఆయనకు పిచ్చి. దాని కోసం కష్టపడటంలో ఆయన ఏమాత్రం అలసత్వం ప్రదర్శించరు. అలాంటి ఆయన గురించి ఈ మధ్య చాల అగౌరవంగా మాట్లాడుతున్నారు కొంతమంది. ఆయన సాధించిన వాటి ముందు ఇవన్నీ చాలా చిన్నవీ. ఆయన్ని విమర్శించడం అంటే ఆకాశంలోలోకి ఉమ్మేయడమే. అంత గొప్ప వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడటం సరికాదు. ఆయన్ని కాపాడుకోవడం మనందరి భాద్యత. అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు కార్తికేయ. ప్రస్తుతం దదీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.