నాగార్జునతో నా సామిరంగ అంటున్న కుర్ర హీరోయిన్

నాగార్జునతో నా సామిరంగ అంటున్న కుర్ర హీరోయిన్

కన్నడలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న ఆషిక రంగ‌నాథ్(Ashika Ranganath) తెలుగు తెరపై మరోసారి మెరవనుంది. అమిగోస్​లో కళ్యాణ్​ రామ్​తో ఈ బ్యూటీ నటించింది. ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్​ ఆషిక తలుపుతట్టినట్టు తెలుస్తోంది. కింగ్​ నాగార్జున(Nagarjuna) హీరోగా వస్తున్న ‘నా సామిరంగా’ (Naa Saami Ranga) సినిమాలో హీరోయిన్​గా సెలక్ట్​ అయినట్టు లేటెస్ట్​ బజ్​. 

ఇప్పటికే ఈ మూవీ కోసం పలువురు హీరోయిన్స్ ని పరిశీలించిన మేకర్స్, ఫైనల్ గా ఈ కన్నడ భామను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇందులో అశికాతో పాటుగా మరో హీరోయిన్​కి కూడా​ రోల్​ ఉండనున్నట్టు సమాచారం. విజయ్​ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. కన్నడ మూవీస్ తో గుర్తింపు తెచ్చుకున్న ఆషిక..తెలుగులో తన అదృష్టం పరీక్షించుకోబోతుంది. నాగ్ మూవీతోనైనా అది సాధ్యం అవుతుందా లేదా అని ఆషిక ఫ్యాన్స్ వెయిట్ చేస్తోన్నారు. 

నా సామిరంగా నుంచి రిలీజైన నాగ్ ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ ఫ్యాన్స్ ను వీపరీతంగా ఆకట్టుకుంటోంది. మాస్ అవతారంలో ఉన్న నాగార్జున చాలా కాలం తరువాత తనదైన ఊర మాస్ యాంగిల్ లో కనిపిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.