గొంతు నులిమి యువకుడి ప్రాణాలు తీశారు.. మంగళ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

గొంతు నులిమి యువకుడి ప్రాణాలు తీశారు.. మంగళ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
  •     వివాహేతర సంబంధమే కారణం?

మెహిదీపట్నం, వెలుగు: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ యువకుడిని హత్య చేశారు. ఈ ఘటన హైదరాబాద్ మంగళ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సీఐ రాఘవేందర్ వివరాల ప్రకారం... శివలాల్ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన సాయినాథ్ సింగ్(25)కు అదే ఏరియాకు చెందిన ఓ మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ విషయం ఆమె ఇంట్లో తెలియడంతో కొంతకాలంగా భర్తతో ఆమెకు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆమె సోదరుడి ఇంట్లో సోమవారం హత్య జరిగిందని పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా.. సాయినాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చున్నీతో గొంతు నులిమి చంపినట్లు గుర్తించారు. మృతుడి డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాడీని ఉస్మానియా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పోస్టుమార్టం కోసం తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.