రిసెప్షన్ లో డ్యాన్స్ చేస్తూ యువకుడు మృతి

రిసెప్షన్ లో డ్యాన్స్ చేస్తూ యువకుడు మృతి

నిర్మల్ జిల్లాలో విషాదం నెలకొంది. పెళ్లి రిసెప్షన్ వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు ఒక్కసారిగి కుప్పకూలిపోయిండు. కుభీర్ మండలంలోని పార్డి(కె) గ్రామంలో శుక్రవారం జరిగిన ఓ వివాహానికి పెళ్లి కొడుకు సమీప బంధువు మహారాష్ట్రలోని శివుని గ్రామానికి చెందిన  ముత్యం(19) హాజరయ్యిండు. శనివారం ఏర్పాటు చేసిన  రిసెప్షన్ వేడుకలో డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిండు. దీంతో అక్కడున్న వారు పరిశీలించగా అపస్మారక స్థితికి వెళ్లిండు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు చెప్పారు.