జ్యోతిష్యం: బైక్.. కారు.. ఏ తేదీల్లో కొనాలి.. రిజిస్ట్రేషన్ నంబర్ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే..!

జ్యోతిష్యం: బైక్.. కారు.. ఏ తేదీల్లో కొనాలి.. రిజిస్ట్రేషన్ నంబర్ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే..!

ఒకప్పుడు సిటీలో కనిపించే బైక్​ లు.. కార్లు... ఇప్పుడు మారు మూల పల్లెల్లో కూడా ఖరీదైన న్యూ మోడల్​ వాహనాలు కనపడుతున్నాయి. దాదాపు ప్రతి ఇంట్లో బైక్​ ఉంటుంది.  కొద్ది మంచి జీతం వచ్చే ఉద్యోగం వచ్చినా.. వ్యాపారం రంజుగా సాగుతున్నా .. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా సరే కారు కొనేందుకు ఆసక్తి చూపుతారు. న్యూమరాలజీ ప్రకారం ఏ తేదీన వాహనం కొనుగోలు చేయాలి.. రిజిష్ట్రేషన్​ నంబర్​ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. . .!

 ప్రస్తుత సమాజంలో కారు ఉండటం ఒకస్టేటస్​. అయితే బైక్​కొన్నా... కారు కొన్నా సాధారణంగా అందరు కాస్ట్​.. మైలేజ్​.. ఫీచర్లపూ దృష్టి పెడతారు.  కొంతమంది లక్షలు పోసిఫ్యాన్సీ నంబర్​ ను వేలంలో కొనుగోలు చేస్తారు. కాని  రిజిస్ట్రేషన్​ నంబర్​ పట్టించుకోరు.  కాని న్యూమరాలజీ ప్రకారం కొన్ని ప్రత్యేకమైర రోజులలోనే వాహనాన్ని కొనుగోలు చేయాలని పండితులు చెబుతున్నారు. 

సంఖ్యా శాస్త్ర పండితులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రోజున ఎలాంటి వాహనం కొనుగోలు చేయకూడదట.  జ్యోతిష్యం ప్రకారం.. శనివారం కర్మదేవత..శనిభగవానుడికి అంకితం చేయబడినరోజు.  ఆ రోజున ఇనుప వస్తువులు కొనడం చాలా అశుభమని పండితులు పండితులు చెబుతున్నారు.  మీరు ఎప్పుడు వాహనం కొనాలనుకున్నా..8,17,26 తేదీల్లో ఎట్టి పరిస్థితిలో కొనుగోలు చేయవద్దని పండితులు చెబుతున్నారు. ఈ తేదీలలో వాహనం పర్చేజ్​ చేస్తే.. ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని పండితులు చెబుతున్నారు.  

సంఖ్యాశాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. 1, 2, 3, 5, 6 తేదీల్లో వాహనాలు కొనాలి.  అయితే ఆ తేదీల్లో శని వారం వస్తే మాత్రం కొనకూడదు.  వాస్తుపరంగా.. జన్మ నక్షత్రం ఆధారంగా మంచి రోజు చూసుకోవాలి.  నక్షత్రబలం.. ముహూర్త బలం కలిసినా కాని న్యూమరాలజీ ప్రకారం 8,17,26 తేదీల్లో కొనకూడదట.  

సంఖ్యాశాస్త్రం ప్రకారం, మీ వాహనం సంఖ్యల మొత్తం 1, 2, 3, 5, లేదా 6 అయితే, అది వాస్తు పరంగా శుభప్రదంగా పరిగణించబడుతుంది.అంతేకాదు రిజిష్ట్రేషన్​ నంబర్లలో జాగ్రత్తగా ఉండాలి.  మొత్తం నాలుగు అంకెలను కలిపితే 4,8,9 సంఖ్యలు రాకూడదట. అలా వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని చెబుతున్నారు. 

 అయితే, మీ వాహనం సంఖ్యల మొత్తం 4, 8, లేదా 9 అయితే, అది అశుభప్రదంగా పరిగణించబడుతుంది. 4 సంఖ్యకు రాహువుకు దగ్గరి సంబంధం ఉంది.  ఆతేదీన కొనుగోలు చేస్తే.. తరచూ రిపేర్లు.. ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. 8 వతేదీన వాహనం కొంటే.. ఆ తేదీ న్యాయదేవత శని భగవానుడికి సంబంధించినది..  ఈ తేదీన కొంటే చట్టపరంగా సమస్యలు వచ్చే అవకావం ఉంది. 9 వతేదీన కొంటే తరచూ ఏదో ఒక ఇబ్బందులు వస్తాయని పండితులు చెబుతున్నారు.  

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.