యూట్యూబ్లో కొత్త ఫీచర్.. పీఐపీ మోడ్

యూట్యూబ్లో కొత్త ఫీచర్.. పీఐపీ మోడ్

యూట్యూబ్​ ప్లాట్​ఫామ్​ మొబైల్ ఫోన్లలో బొమ్మ మీద బొమ్మ (పిక్చర్-ఇన్-పిక్చర్) కనపడేలా కొత్త ఫీచర్​ను తీసుకొచ్చింది. దీన్నే పీఐపీ అని పిలుస్తారు. మామూలుగా మనం ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు వేరే పని చేయాలంటే ఆ వీడియోను ఆపివేయాల్సి వచ్చేది. కానీ ఈ పీఐపీ వల్ల మనం చూస్తున్న వీడియో ఒక చిన్న విండోలా మారి తెరపై ఒక పక్కన కనిపిస్తూనే ఉంటుంది. దీంతో ఆ వీడియోను చూస్తూనే మనం ఇతరులకు మెసేజ్ చేయడం లేదా వేరే సమాచారాన్ని వెతకడం వంటి పనులు ఒకేసారి చేసుకోవచ్చు. 

ఈ సౌకర్యం ముఖ్యంగా వీడియో కాల్స్ చేసేటప్పుడు లేదా రోడ్​ మీద రూట్​మ్యాప్స్ వాడుతున్నప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది. యూట్యూబ్ వంటి యాప్‌‌లలో దీనిని వాడుకోవాలంటే ముందుగా ఫోన్ సెట్టింగ్‌‌లలో ప్రత్యేక అనుమతులు ఇవ్వాలి. అక్కడ యాప్స్ అనే విభాగంలోకి వెళ్లి ఈ చిన్న విండో ఫెసిలిటీని యాక్సెస్ చేయాలి. ఆ తర్వాత మీరు వీడియో చూస్తున్నప్పుడు నేరుగా హోమ్ బటన్ నొక్కితే ఆ వీడియో చిన్నదిగా మారిపోతుంది. 

ఈ చిన్న విండోను స్క్రీన్​పై మీకు నచ్చిన చోటికి జరుపుకోవచ్చు లేదా దాని పరిమాణాన్ని కూడా మార్చుకోవచ్చు. దీనివల్ల మన సమయం ఆదా అవ్వడమే కాకుండా ఫోన్ వాడకం మరింత సులువుగా మారుతుంది. ఐఫోన్లలో సెట్టింగ్స్ లోకి వెళ్లి జనరల్ సెక్షన్​లో అక్కడ ఉన్న పీఐపీని ఆటోమెటిక్​గా ఆన్ అయ్యేలా సెలక్ట్ చేయండి. మీ మొబైల్‌‌లోని సెట్టింగ్స్‌‌లో పైన ఉన్న సెర్చ్ బార్‌‌లో పిక్చర్ ఇన్ పిక్చర్​ అని టైప్ చేసి కూడా ఈ ఫీచర్​ను ఈజీగా వెతకొచ్చు.