
బేబీ(Baby) సినిమా సక్సెస్ తో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా ఎదిగిపోయాడు దర్శకుడు సాయి రాజేష్(Sai rajesh). సంపూర్ణేష్ బాబు(Sampoornesh babu) హీరోగా వచ్చిన హృదయ కాలేయం(Hrudaya kaleyam) సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ దర్శకుడు.. కొద్దీ కాలంలోనే దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. అందుకే ఈ దర్శకుడి సినిమాలపై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ పెరిగింది.
బేబీ తరువాత ఆయన చేయబోయే సినిమా ఏంటని ఆడియన్స్ ఇప్పటినుండే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన తరువాతి సినిమాపై ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. దర్శకుడు సాయి రాజేష్ నిర్మాతగా కొత్త సినిమాను మొదలుపెట్టనున్నాడట. ఈ సినిమాలో ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ అలేఖ్య హారిక(Alekhya harika)ను హీరోయిన్ గా తీసుకోనున్నారట. కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న ఈ సినిమాలో సంతోష్ శోభన్(Santhosh shobhan) హీరోగా చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే దర్శకుడు సాయి రాజేష్ బేబీ సినిమా కోసం కూడా యూట్యూబర్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya)ను హీరోయిన్ గా తీసుకున్నారు. వైష్ణవి కూడా తన అద్భుతమైన నటనతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది. ఇప్పుడు మరోసారి మరో యూట్యూబర్ అలేఖ్య హారికను తన తరువాతి సినిమా కోసం తీసుకుంటున్నాడు దర్శకుడు సాయి రాజేష్. మరి ఆమె కోసం ఎలాంటి పాత్రను డిజైన్ చేశాడో, అందులో ఆమె ఎంత బాగా నటిస్తుందో చూడాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.