ఏపీలో స్థానిక ఎన్నికల నామానినేషన్ల సందర్భంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అంశంలో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా వేసేంతవరకు వెళ్ళింది పరిస్థితి. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అండ్ కో రాష్ట్రాన్ని జంగల్ రాజ్ గా మార్చేశారని.. నామినేషన్స్ కే ఇలా ఉంటే పోలింగ్ రోజున పరిస్థితి ఎలా ఉంటుందోనని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీటిని ఎన్నైకలు అంటారా అని ప్రశ్నించారు జగన్.
మహాభారతంలో శకునికి పాచికలు ఉండేవని... ఏ నంబర్ కావాలంటే ఆ నంబర్ పారేలా చేసి గేమ్ నడిపించాడని.. అలాగే చంద్రబాబు కూడా శకుని లాగా మారిపోయి రూల్స్ సెట్ చేస్తున్నాడని మండిపడ్డారు జగన్. నామినేషన్స్ కూడా వేయనీయకుండా... ఎన్నికల్లో పోటీ చేయకుండా చేస్తున్నారని అన్నారు.
తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్స్ ఎక్కడ వేయాలో కూడా చంద్రబాబే డిసైడ్ చేస్తున్నారని... తనకు నచ్చిన చోట నామినేషన్స్ వేయించి మిగతా చోట అడ్డుకుంటున్నారని అన్నారు. ఏపీలో ఇంత దారుణమైన పరిస్థితి నెలకొందని అన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నా కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని.. ఎంపీటీసీ, జేడీపీటీసి అభ్యర్థులను కూడా నామినేషన్స్ వేయకుండా అడ్డుకుంటున్నారని అన్నారు.
తమ హయాంలో కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా కూడా దైర్యంగా ఎన్నికలు ఎదుర్కొన్నామని అన్నారు జగన్. మానిఫెస్టోలో చెప్పిన హామీలు 95 శాతం పూర్తి చేసి ఎన్నికలువెళ్లామని అన్నారు. సుప్రీంకోర్టు చెప్పినా తమను నామినేషన్స్ వేయనివ్వడం లేదంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతోందని అన్నారు జగన్.
