పవన్.. ఫ్రెష్ లడ్డూలు ఏమైనా ఇచ్చారా?

పవన్.. ఫ్రెష్ లడ్డూలు ఏమైనా ఇచ్చారా?

ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా  బేషరతుగా బీజేపీకి మద్దతివ్వాల్సిన అవసరమేంటని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు వైసీపీ నేత అంబటి రాంబాబు. రాజకీయ స్థిరత్వం లేని పవన్.. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా మరో నాలుగున్నరేళ్లు ఉండగలరా? అని అన్నారు. గతంలో పాచిపోయిన లడ్డూలు ఇచ్చారన్న పవన్ కు ఇవాళ బీజేపీ నేతలు  ఫ్రెష్ లడ్డూలు ఏమైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. పవన్ ఏ పార్టీ ఆఫీసులో కూర్చుంటే ఆ పార్టీకే మద్దతిస్తారన్నారు. పవన్ ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టేనన్నారు. ఎన్ని పార్టీలు ఏకమైనా వైసీపీకి వచ్చిన డోకా లేదన్నారు. ఏపీలో బీజేపీ,జనసేన వల్ల ఒరిగేదేం లేదన్నారు.గత ఎన్నికల్లో వాటి పరిస్థితి ఏంటో అందరికీ తెలుసన్నారు.