స్థానిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో ఏపీలో పొలిటికల్ హీట్ రెట్టింపవుతోంది. నామినేషన్ల ప్రక్రియ మొదలైన రోజు నుంచే పలు చోట్ల వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణలు ఉద్రిక్తతకు దారి తీశాయి. నామినేషన్ వేసేందుకు వెళ్తున్న వైసీపీ అభ్యర్థులను టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో పుంగనూరు, పులివెందుల, కడప, రాయచోటి వంటి చోట్ల పరిస్థితి రణరంగంగా మారింది.
ఈ క్రమంలో శనివారం ( అక్టోబర్ 17 ) ఈసీని కలిశారు వైసీపీ నేతలు. తమ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకుంటున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు.
నిన్న, ఇవాళ జరిగిన పుంగనూరు, రాయచోటి, పులివెందుల, కడప జిల్లా ఘటనలపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ క్రమంలో ఈసీతో వాగ్వాదానికి దిగారు అప్పిరెడ్డి. ఎక్కడెక్కడ నామినేషన్లను అడ్డుకున్నారో పూర్తి వివరాలివ్వాలని కోరారు ఎస్ఈసీ
