అడివి శేష్ హీరోగా షానియల్ డియో తెరకెక్కిస్తున్న చిత్రం ‘డెకాయిట్’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌కు చెందిన మరొకరు నటిస్తున్నారు. తన పేరు జైన్ మేరీ ఖాన్. శనివారం ఆమె పోషించిన జానకి పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో ఆమె పోలీసాఫీసర్‌గా కీలకపాత్రను పోషిస్తోంది. పోస్టర్‌లో జైన్ క్యారెక్టర్‌కు సంబంధించిన ఇంటెన్సిటీ కనిపిస్తోంది.
ఆమీర్ ఖాన్ కజిన్ బ్రదర్, దర్శకుడు మన్సూర్ ఖాన్ కూతురైన జైన్ మేరీ ఖాన్.. ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా స్పందించిన ఆమీర్ ఖాన్.. మూవీ టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ కో ప్రొడ్యూసర్. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 10న సినిమా విడుదల కానుంది.
