T20 World Cup: గాల్లో ఎగిరి పక్షిలా క్యాచ్ పట్టిన జింబాబ్వే ప్లేయర్.. నెట్టింట వీడియో వైరల్

T20 World Cup: గాల్లో ఎగిరి పక్షిలా క్యాచ్ పట్టిన జింబాబ్వే ప్లేయర్.. నెట్టింట వీడియో వైరల్

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టుపై పసికూన జింబాబ్వే సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో జింబాబ్వే ఆటగాడు మున్యోంగా పట్టిన అద్భుతమైన క్యాచ్ టోర్నీలో హైలైట్ గా నిలిచింది. బ్రాడ్ బౌలింగ్ లో డ్వార్షూస్ డీప్ మిడ్ వికెట్ దిశగా షాట్ ఆడారు. సుమారు 15 మీటర్ల దూరంలో ఉన్న మున్యోంగా స్పీడ్ గా పరిగెత్తుకొచ్చారు. అంతా క్యాచ్ చేజారిందనే అనుకునేలోపు.. ఒక్కసారిగా డైవ్ చేసి బాల్ ని చేతితో పట్టుకున్నాడు. గాల్లో క్యాచ్ పట్టినప్పుడు అతడు సేమ్ పక్షిలా కనిపించాడు. జింబాబ్వే ప్లేయర్ మున్యోంగా పట్టిన ఈ క్యాచ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 
 
కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. జస్ట్ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి.. 169 రన్స్ చేసింది. 170 పరుగుల లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన ఆసీస్.. ఎవరూ ఊహించని విధంగా.. కేవలం 146 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 23 పరుగుల తేడాతో ఓడిపోయింది.