రాయ్పూర్ వేదికగా జరుగుతోన్న రెండో టీ20లో భారత మహిళా బౌలర్లు జింబాబ్వేను కట్టడి చేశారు. టీమిండియా బౌలర్లు విజృభించడంతో జింబాబ్వే ఉమెన్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 102 పరుగులు మాత్రమే చేసింది.
జింబాబ్వే బ్యాటర్లలో చిపో ముగేరి-తిరిపానో (34), కెప్టెన్ జోసెఫిన్ ఎన్కోమో (27) ఇద్దరు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ సాధించారు. మిగిలిన బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో నికీ ప్రసాద్ రెండు వికెట్లు తీయగా.. శ్రీచరణి, నందని శర్మ, దీప్తీ శర్మ, క్రాంతి గౌడ్ తలో వికెట్ సాధించారు.
అనంతరం స్మృతి సేన 103 పరుగుల స్వల్ప లక్ష్యంతో ఛేజింగ్ మొదలుపెట్టింది. ఇప్పటికే తొలి టీ20 గెలిచిన టీమిండియా.. రెండో మ్యాచులోనూ విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది.
