బ్యాటింగ్‎లో చేతులేత్తేసిన జింబాబ్వే.. స్మృతి సేన టార్గెట్ ఎంతంటే..?

బ్యాటింగ్‎లో చేతులేత్తేసిన జింబాబ్వే.. స్మృతి సేన టార్గెట్ ఎంతంటే..?

గాంధీనగర్: భారత జట్టుతో జరుగుతోన్న తొలి టీ20లో బ్యాటింగ్‎లో జింబాబ్వే మహిళా జట్టు తడబడింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తక్కువ స్కోర్‎కే పరిమితమైంది. గుజరాత్‎లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 114  పరుగులు చేసింది. 

ఓపెనర్ కెల్లీస్ ఎన్డ్లోవు (42), షార్న్ మేయర్స్ (43) ఇద్దరే రాణించారు. భారత బౌలర్లు విజృంభించడంతో మిగిలిన బ్యాటర్లు పరుగులు చేయడంలో విఫలమయ్యారు. దీంతో జింబాబ్వే భారీ స్కోర్ చేయలేకపోయింది. భారత బౌలర్లలో నందిని శర్మ రెండు వికెట్లు తీయగా.. క్రాంతి గౌడ్, శ్రీచరణి, అరుంధతి రెడ్డి తలో వికెట్ పడగొట్టారు. అనంతరం స్మృతి సేన 115 పరుగుల స్వల్ప లక్ష్యంతో ఛేజింగ్‎కు దిగింది. 

స్మృతికి తొలి సిరీస్:

భారత మహిళా జట్టుగా కెప్టెన్‎గా ఇటీవల హార్మన్‎ప్రీత్ కౌర్ తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో స్టార్ బ్యాటర్ స్మృతి మందనాను బీసీసీఐ టీమిండియా మహిళా జట్టు కెప్టెన్‎గా నియమించింది. టీమిండియా కెప్టెన్‎గా స్మృతికి ఇదే తొలి సిరీస్. దీంతో ఈ సిరీస్‎ను ఎలాగైనా నెగ్గి విజయంతో కెప్టెన్సీ ప్రస్థానాన్ని మొదలుపెట్టాలని స్మృతి భావిస్తోంది.