నువ్వు కెవ్వు కేక : ప్రతి డెలివరీకి ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇచ్చిన జొమాటో బాయ్

నువ్వు కెవ్వు కేక : ప్రతి డెలివరీకి ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇచ్చిన జొమాటో బాయ్

ఆనందం పంచుకుంటే పెరుగుతుంది.. నువ్వు చిన్నోడా.. పెద్దోడా అని తేడా లేదు.. క్రియేటివిటీ ఉంటే చాలు.. చేసే పని చిన్నదా పెద్దదా అని కాదు.. పుట్టిన రోజును ఎంత ఆనందంగా ఎంజాయ్ చేశావ్ అనేది ముఖ్యం.  పుట్టిన రోజు కూడా సెలవు తీసుకోకుండా డ్యూటీకి వచ్చిన జొమాటా బాయ్.. తన సొంత డబ్బులతో.. డెలివరీ ఆర్డర్ వచ్చిన ప్రతి ఒక్కరికీ చాక్లెట్స్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు.. అది కూడా ఫైవ్ స్టార్ చాక్లెట్.. వివరాల్లోకి వెళితే.. 
ఢిల్లీకి చెందిన కరణ్​ ఆప్టే తన పుట్టిన రోజును ప్రత్యేకంగా జరపాలనుకున్నాడు. అందరికన్నా విభిన్నంగా ఏం చేయాలా అని ఆలోచించగానే అతన్ని మెదళ్లోకి టక్కన ఓ ఐడియా వచ్చింది. జొమాటో డెలివరీ బాయ్​గా చేస్తున్న అతను బర్త్డే నాడు ఫుడ్​ డెలివరీ చేస్తూ.. ప్రతి కస్టమర్​ డెలివరీ ప్యాక్​పై  ఫైవ్​స్టార్​ చాక్లెట్ అంటించాలనుకున్నాడు. అలా కస్టమర్లకు పంచి తన సంతోషాన్ని షేర్​ చేసుకున్నాడు. ఈ విషయాన్ని అతను ఫేస్​ బుక్​లో షేర్​ చేశాడు. పుట్టిన రోజు జరుపుకున్న తీరుపై నెటిజన్లు  అభినందిస్తున్నారు. మన బర్త్డే నాడు ఎవరైనా గిఫ్ట్​లు ఇస్తారేమోనని ఎదురు చూస్తుంటాం.. కానీ ఆప్టే మాత్రం తనకు పరిచయం లేని వారికి సైతం చాక్లెట్లు పంపిణీ చేయడం గొప్ప విషయం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరు యూజ‌ర్లు ఈ పోస్ట్‌ను జొమాటోకు ట్యాగ్ చేసి బ‌ర్త్‌డే బాయ్‌కు గిఫ్ట్ అందించాల‌ని, బ‌ర్త్‌డే సెల‌బ్రేట్ చేయాల‌ని కోరారు.