Zomato instant : జొమాటో ఇన్‌స్టంట్‌ను రీ బ్రాండ్ చేస్తున్నం

Zomato instant : జొమాటో ఇన్‌స్టంట్‌ను రీ బ్రాండ్ చేస్తున్నం

ఇన్ స్టంట్ సర్వీసును క్లోజ్ చేశారన్న వార్తలపై జొమాటో స్పందించింది. అందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. మార్కెటింగ్ సమస్య, నష్టాల కారణంగా జొమాటో ఇన్ స్టంట్ (10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ) సర్వీస్ మూసివేస్తోందని వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై స్పందించిన జొమాటో సీఈఓ దీపేందర్ గోయల్ ఇన్ స్టంట్ సర్వీస్ రీ బ్రాండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

‘జొమాటో ఇన్‌స్టంట్ సేవల్ని నిలిపివేయట్లేదు. ఈ విషయంలో వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజంలేదు. జొమాటో ఇన్‌స్టంట్ సేవల్ని మెరుగుపర్చడం సహా విస్తరించేందుకు కృషి చేస్తున్నాం. ఈ సేవల్ని రీబ్రాండింగ్ చేయబోతున్నాం’ అని తెలిపారు.

10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ అందించేందుకు గతేడాది మార్చిలో జొమాటో ఇన్ స్టంట్ సర్వీస్‌ ప్రారంభించింది. డిమాండ్ ఆధారంగా 20 నుంచి 30 రకాల ఆహార పదార్థాలను 2 కిలోమీటర్ల పరిధిలో 10 నిమిషాల్లో డెలివరీ చేస్తోంది.