ఇన్ఫ్లుయెన్సర్స్ రెగ్యులర్‌గా లైవ్ స్ట్రీమింగ్, వీడియో షూటింగ్ చేస్తుంటారు. ఇది పెండ్లిళ్ల సీజన్ కాబట్టి ఫొటోగ్రాఫర్స్ గంటల తరబడి ఫొటోలు తీస్తుంటారు. అలాంటప్పుడు కెమెరాలు వేడెక్కి పర్ఫార్మెన్స్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. అందుకే వాటిని చల్లబరిచేందుకు ఇలాంటి ఫ్యాన్‌ని వాడితే సరిపోతుంది. దీన్ని జెర్బెస్ అనే కంపెనీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇందులో హై-ఎఫిషియెంట్ ఫ్యాన్ ఉంటుంది. కెమెరా టెంపరేచర్ని వేగంగా తగ్గిస్తుంది. ఇందులో 5 స్పీడ్ కూలింగ్ మోడ్స్ ఉన్నాయి.
ఎయిర్ ఫ్లోను కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది రీచార్జబుల్ బ్యాటరీతో పని చేస్తుంది. టైప్‌సీతో చార్జింగ్ పెట్టుకోవచ్చు. సెక్యూర్ స్ప్రింగ్ లోడెడ్ క్లాంప్ డిజైన్‌తో వస్తుంది. కాబట్టి కెమెరా బాడీకి పర్ఫెక్ట్‌గా అటాచ్ అవుతుంది. రియల్-టైమ్ ఎల్‌సీడీ స్క్రీన్‌పై బ్యాటరీ పర్సంటేజ్ డిస్‌ప్లే అవుతుంది.
ఒకే బటన్‌తో కంట్రోల్ చేయొచ్చు. సిలికాన్ మెటీరియల్‌తో తయారుచేయడం వల్ల లైట్‌వెయిట్‌తో వస్తుంది. లైవ్ స్ట్రీమర్లు, కంటెంట్ క్రియేటర్లు, ఫొటోగ్రాఫర్లకు స్టూడియో లైట్స్ కింద లేదా వేడి వాతావరణంలో గంటల తరబడి షూట్ చేసేవాళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

