సంతాన ప్రాప్తిరస్తుకు పాజిటివ్ టాక్.. ఫ్యామిలీస్‌‌‌‌ మెచ్చిన వినోదంతో విజయం

సంతాన ప్రాప్తిరస్తుకు పాజిటివ్ టాక్.. ఫ్యామిలీస్‌‌‌‌ మెచ్చిన  వినోదంతో విజయం

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి అన్ని  సెంటర్స్‌‌‌‌ నుంచి పాజిటివ్‌‌‌‌ టాక్ వచ్చిందంటూ ప్రెస్‌‌‌‌మీట్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ‘ఫ్యామిలీస్‌‌‌‌ మెచ్చిన హోల్‌‌‌‌ సమ్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా మా చిత్రానికి చక్కని ప్రేక్షకాదరణ లభిస్తోంది.  నైజాంతో పాటు విజయవాడ, విశాఖ, రాజమండ్రి, ఒంగోలు సహా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల నుంచి సక్సెస్‌‌‌‌ టాక్ వచ్చింది.  అలాగే రివ్యూస్ కూడా పాజిటివ్‌‌‌‌గా వచ్చాయి.  

ఒక వినోదాత్మక చిత్రం కోసం ప్రేక్షకుల ఎంతలా ఎదురుచూస్తున్నారో మా సినిమా విజయంతో అర్థమైంది’ అని అన్నారు.  ‘ఒక సోషల్ ఇష్యూను ఎలాంటి అసభ్యత లేకుండా వినోదాత్మకంగా చూపించారంటూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి’ అని దర్శకుడు చెప్పాడు.  క్లీన్ ఫ్యామిలీ సినిమా అని మేము ప్రమోషన్స్‌‌‌‌లో చెప్పినట్టుగా, ప్రేక్షకుల నుంచి అదే ఫీడ్ బ్యాక్ రావడం సంతోషంగా ఉందని హీరోహీరోయిన్స్‌‌‌‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో టీమ్ అంతా పాల్గొన్నారు.